Sunday, September 8, 2024

తమ్ముళ్లు మీ బాబుకు ఇవే చివరి ఎన్నికలంటా..చూసుకోండి ఉంటాడో లేదో

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చేశారు. మీరే తేల్చుకోవాలని చెప్పకనే చెప్పేశారు. మ్యాటర్ ఏమిటంటే.. తనకు ఇవే చివరి ఎన్నికలను .. గెలిస్తే.. అసెంబ్లీకి వెళ్తానని… లేకపోతే… ఇంట్లో కూర్చంటానని..టీడీపీ శ్రేణులతో పాటు, ప్రజలను కూడా సెంటిమెంట్‌తో కొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… రాబోవు ఎన్నికలు టీడీపీ పార్టీకి చావో రేవో అని అందరు అనుకుంటున్నారు. కాని .. వాస్తవం మాత్రం దీనికి విరుద్దంగా ఉంది. టీడీపీ కన్నా కూడా వచ్చే ఎన్నికలు ఆ పార్టీ అధినేతకు చాలా కీలకంగా మారాయి. ఇప్పటకే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ..చంద్రబాబు నాయకత్వం మీద అందరికి అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

చాలామంది నాయకులు పార్టీ బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించాలని బుచ్చయ్య చౌదరి వంటి నేతలు కోరారు. ఇటువంటి క్లిష్ట సమయంలోనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెర లేపారు. సొంత కుటుంబం మీద అభండాలు వేసుకోవడానికి సైతం ఆయన వెనకాడ లేదు. అయితే దీనిని ప్రజలు ఎవరు కూడా నమ్మకపోవడంతో..మళ్లీ పవన్‌తో దోస్తీ కట్టడానికి ఆయన సిద్దం అయ్యారు. పవన్‌తో వెళ్లినప్పటికి కూడా లాభం లేదనుకున్నారో ఏమో తెలియదు కాని.. ప్రజలను సెంటిమెంట్‌తో రెచ్చకొట్టే ప్రయత్నం చేశారు.

ఇవే నాకు చివరి ఎన్నికలని..గెలిస్తే అసెంబ్లీకి వెళ్తానని ఆయన చెప్పుకొచ్చారు. తమను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓకే.. లేదంటే ఇదే తనకు చివరి ఎన్నిక అవుతుందని స్పష్టంచేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని హింట్ ఇచ్చారు. వయస్సు పై బడటంతో.. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి ఉంది. కానీ ఆయన జనాలతో చెప్పి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకుంటే.. లోకేశ్ నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే అతని వల్ల అవుతుందా.. లేదా అనే సందేహాం వ్యక్తం కావడం సహాజమే. మరి తమ్ముళ్లు చూసుకోండి చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటా.. తరువాత అయిన తెర మీద కనబడటం కష్టం. మరి చంద్రబాబును అసెంబ్లీకి పంపిస్తారో లేక ఇంట్లో కూర్చోబెడతారో అంతా మీ చేతుల్లోనే ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!