థగ్స్ అఫ్ హిందుస్థాన్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజై, ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి బారి నుంచి అతి బారి డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుల కామెంట్స్ చూస్తుంటే, ఎవరైనా ఈ సినిమా వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా ఉన్నాయి. థియేటర్ లో కూర్చున్న దగ్గర నుంచి సినిమా అయిపోయే వరకు సినిమాను అతి దారుణంగా తీసి ప్రేక్షకులను హింసించే సినిమాగా ముద్రపడిపోయిందని ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అమీర్ ఖాన్ కెరీర్ లో ఇంత బారి డిజాస్టర్ ఇంకోటి లేదని చెప్పుకొచ్చారు.

థగ్స్ అఫ్ హిందుస్థాన్ సినిమాను 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా సినిమాపై నెగటివ్ గా చెప్పడంతో బాలీవుడ్ జనమంతా ఇప్పుడు ఈ సినిమా గురించే డిస్కషన్స్ చేస్తున్నారు. మూడు వందల కోట్ల రూపాయల బారి వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా బయ్యర్స్ గట్టిగానే దెబ్బతిననున్నారు. ఈ సినిమా మొదట హీరోగా హృతిక్ రోషన్ ను అనుకోగా, హృతిక్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది.