Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు మురళీ శర్మ. ఈ నటుడు కోసం మేకర్స్ కూడా సరికొత్త పాత్రలను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి పాత్రలోనైనా సరే నూటికి నూరు శాతం ఆ పాత్రలలో జీవిస్తూ నటిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు ఈయన డేట్లు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉంటే మురళి శర్మ ఆయన భార్య కూడా టాలీవుడ్ లో క్రేజీ స్టార్ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈమె పలు చిత్రాలలో కూడా నటించింది.
మురళి శర్మ భార్య పేరు అశ్వని కల్ శేఖర్ . ఈమె అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ చిత్రంలో విలన్ సర్కార్ భార్యగా కూడా నటించి అదరగొట్టేసింది. ఈ చిత్రంలో విలన్ కంటే ఎక్కువగా హైలెట్గా మారిపోయింది. అలాగే రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ప్రదీప్ రావత్ భార్యగా కూడా లేడీ విలన్ గా నటించి ఆశ్చర్యపరిచింది. అలాగే డైరెక్టర్ పూరి కొడుకు నటించిన మెహబూబా చిత్రంలో కూడా ముంతాజ్ గా నటించింది. ఇలా తెలుగులో మూడు చిత్రాలలో నటించినప్పటికీ ఇమే టెలివిజన్ రంగంలో కూడా మంచి పాపులర్ కి సంపాదించుకున్నదట.
మరొక వైపు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్లలో కూడా నటించింది. మహేష్ నటించిన అతిథి చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటుడు మురళీ శర్మ తన మొదటి చిత్రంతోనే నంది అవార్డును కూడా అందుకున్నారట. ఏడాదికి 8 చిత్రాలతో మురళీ శర్మ బిజీగా గడిపేస్తున్నారు. ఇటీవల విడుదలైన సరిపోదా శనివారం సినిమాలో కూడా ఎస్ జె సూర్య అన్న పాత్రలో చాలా అద్భుతంగా నటించారు మురళీ శర్మ. అందుకే మురళి శర్మ కూడ టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకోవడం జరిగింది.