అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఈ సినిమాలో ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తుంది. ఈ చిత్రంలో ఒక ఫన్ సాంగ్ లో వీరిద్దరి తో కలిసి అనసూయ స్టెప్పులు వేయనుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘విన్నర్’ సినిమాలో అనసూయ స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.