విక్టరీ వెంకటేష్‌, తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైంది. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ను ఫైనల్‌ చేయాల్సి ఉంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వెంకిమామ టైటిల్ పరిశీలనలో ఉంది.

Tags: Victory Venkatesh, Naga Chaitanya, Babi, Multistarrer, Rakul preet singh