బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తూ, నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రతి విసయంలోనూ బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్య బాలన్ నటింప చేయాలనీ క్రిష్ కోరిన వెంటనే బాలకృష్ణ ఒకే చెప్పడం, నేరుగా బాలకృష్ణ విద్యాబాలన్ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ బయోపిక్ గురించి చెప్పి ఆ సినిమాలో విద్య బాలన్ పాత్ర ప్రాముఖ్యత గురించి వివరించారు. విద్యాబాలన్ నటించడానికి ఒప్పుకుంది కానీ రెండు కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేసిందట. బసవతారకం పాత్ర సినిమాలో చిన్నదైనా రెండు కోట్ల రూపాయల పారితోషకం ఇవ్వడానికి బాలకృష్ణ ఒప్పుకున్నట్లు సమాచారం. తన తండ్రి మీద తీస్తున్న సినిమా దేశ వ్యాప్తంగా చెప్పుకొనేలా ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి బాలకృష్ణ కంకణం కట్టుకున్నాడు.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఇంకా ఇతర తారాగణంగా తెలుగు పరిశ్రమకు చెందిన మహా మహా నటులను నటింప చేయడానికి బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలకృష్ణనే నిర్మాత కావడంతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకొని ఆ స్థానంలో క్రిష్ దర్శకుడిగా రావడంతో చిత్రానికి మంచి బజ్ వచ్చినట్లు కనపడుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రస్తతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంత్రికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags : Nandamuri Balakrishna, NTR Biopic, Vidya Balan, Krish, Basavatarakam