విజయ్ దేవరకొండ ఈపేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం, విజయ్ నటించిన నాలుగు సినిమాలలో మూడు సూపర్ హిట్ టాక్ తో పాటు తాను చివరగా నటించిన “గీత గోవిందం” సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న “నోటా” సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ లో టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ పెట్టేసారు. రాజకీయాల నేపథ్యంలో వస్తున్న నోటా సినిమాపై ప్రేక్షకులు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకోవడంతో చాల ఆసక్తిగా ఉన్నారు. సినిమా ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా మరో 100 కోట్ల సినిమా అవ్వడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఇక విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ కోసం దర్శక, నిర్మాతలు ముమ్మర ప్రయత్నాలలో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ “నోటా” ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ విజయ్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నానని చెప్పడంతో విజయ్ దేవరకొండ క్రెజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే విజయ్ దేవరకొండకు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు విజయ్ తో సినిమా చేయడానికి కథను సిద్ధం చేస్తున్నారు. తమిళ నిర్మాత ప్రభు అడ్వాన్స్ విజయ్ దగ్గర ఉండటంతో ప్రభు త్వరలో విజయ్ తో సినిమా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక తమిళ మహిళా దర్శకురాలు స్టోరీ లైన్ చెప్పడంతో అది నిర్మాత, హీరోకు నచ్చడంతో ఆ లైన్ డెవలప్ చేసే పనిలో బిజీగా ఉంది. ఈ సినిమా కూడా తమిళ, తెలుగు, మలయాళ బాషలలో రూపొందనుందని తెలుస్తుంది. మరో మారు విజయ్ తో సినిమా చేయడానికి అల్లు అరవింద్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా 2019 లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత విజయ్ ఏ సినిమాలో నటిస్తాడన్నది తేలనుంది.