టాలీవుడ్ సంచలన హీరో విజయ్ దేవరకొండ నటించిన “గీత గోవిందం” సినిమా సంచలన రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మూడు రోజులు సెలవు రోజులు కావడంతో మరిన్ని రికార్డ్స్ విజయ్ దేవరకొండ సృష్టించే అవకాశం కనపడుతుంది. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ వరుస షూటింగ్ లతో విసిగిపోయానని. కొన్ని రోజులు అందరకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని తెలియచేసారు.

షూటింగ్ బ్రేక్ ఇచ్చి పది రోజుల పాటు యూరప్ టూర్ కు వెళ్లడానికి విజయ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ టూర్ లో సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ చేతిలో ద్విభాషా చిత్రంగా వస్తున్న “నోటా”తో పాటు “డియర్ కామ్రేడ్” కూడా విజయ్ చేతిలో ఉన్నాయి. ప్రస్తతం “గీత గోవిందం”తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ త్వరలో మరొక సినిమా “టాక్సీవాలా” విడుదలకు సిద్ధంగా ఉంది.