సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన “నోటా” సినిమా ప్లాప్ అవ్వడంతో రౌడీ అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనైట్లు కనపడుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కొంత మంది పండుగ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొంత మంది హీరోలు విజయ్ దేవరకొండకు ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాల నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కూడా తన సినిమా ప్లాప్ అయిందని, త్వరలో మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నాడు.

ప్రస్తతం విజయ్ దేవరకొండ చేతిలో “టాక్సీవాలా, డియర్ కామ్రేడ్” సినిమాలు ఉన్నాయి. “టాక్సీవాలా” సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంటె, “డియర్ కామ్రేడ్”‘ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాను క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ఈనెల 18న దసరా కానుకగా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన ముగ్గురు బామలు నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పక్క రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను కేఎస్ రామారావు నిర్మించనున్నారు .