ప్రముఖ దర్శక, నిర్మాత విజయబాపినీడు కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమకు పలు సూపర్ హిట్ సినిమాలను అందించిన విజయ బాపినీడు కన్నుమూశారు. అనారోగ్య కారణంతో ఈ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. సినీ పరిశ్రమలో విజయబాపినీడుగా సుపరిచితమైన ఆయన 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు.

మొత్తం 22 సినిమాలకు దర్శకత్వం వహించారు విజయ బాపినీడు. శోభన్ బాబు, చిరంజీవితో అనేక హిట్ చిత్రాలను తీశారు. ఈయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, చిరంజీవి ఇంకా అనేక సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

chiranjeevi bhapineedu