డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ హీరో విశాల్. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు పందెం కోడి 2. 2005లో విశాల్, మీరా జాస్మిన్ జంటగా నటించిన సూపర్ హిట్ సాధించిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ లగా నటిస్తున్నారు. అయితే ‘పందెంకోడి 2’ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నట్లు సమాచారం. ఎంత మొత్తానికి తీసుకున్నాడన్నది అధికారికంగా తెలియరాలేదు. కానీ తెలుగు వెర్షన్ థియేటర్, శాటిలైట్ అన్నీ కలిపి పదికోట్ల వరకూ వుంటుందని సమాచారం. తెలుగులో హిట్ అయిన టెంపర్ మూవీని విశాల్ తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన పందెంకోడి 2 హక్కులను కూడా ఠాగూర్ మధుకు ఇచ్చారనే అంటున్నారు. లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కాబోతోంది.

Tags: Vishal, Keerthi Suresh, Linga Swamy, Pandem Kodi 2, Tagore Madhu