డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ హీరో విశాల్. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు పందెం కోడి 2. 2005లో విశాల్, మీరా జాస్మిన్ జంటగా నటించిన సూపర్ హిట్ సాధించిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లో కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో కలిపి 2000 స్క్రీన్ లలో విడుదలకాబోతుంది. ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. లింగు సామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కాబోతోంది.