తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పాపులర్ హీరోగా మంచి పేరు సంపాదించిన హీరో విశాల్ ఇప్పుడు కొంత ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నట్లు సినిమా ఇండస్ట్రీ వర్గాల ద్వారా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా విశాల్ ఎక్కువగా బయట నిర్మాతలతో సినిమాలు చేయకుండా తానే స్వయంగా సినిమాలు నిర్మించుకుంటాడు. అందులో కొన్ని హిట్స్ కొన్ని ప్లాప్ లు ఉన్నాయి. ఎక్కువ భాగం ప్లాప్ లు అందుకోవడంతో కొంత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది.

విశాల్ హీరోగా వచ్చిన “అభిమన్యుడు” సినిమా ఈ మధ్యే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత తన సొంత బ్యానర్ లోనే విశాల్ 25 వ సినిమాగా వస్తున్న “పందెం కోడి 2” ఈనెల 18న విడుదలకు సిద్ధమవుతుంది. 10 సంవత్సరాల క్రితం వచ్చిన “పందెం కోడి” సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. కానీ ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఈ సినిమా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ తీసుకొని సినిమాలు నిర్మించడం మాములే, అలాగే విశాల్ కూడా అదే విధంగా ఫైనాన్స్ తీసుకొని సినిమాలు నిర్మించినా డబ్బులు రొటేషన్ సరిగ్గా అవ్వక పోవడంతో ఆర్ధిక కష్టాలు చుట్టు ముట్టినట్లు తెలుస్తుంది. కానీ “పందెం కోడి 2” మీద ఉన్న అంచనాలతో అవి అన్ని అధిగమించి మంచి హిట్ అందుకుంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క సారిగా తీరిపోయే అవకాశం ఉంది.