కమలహాసన్ నటించిన “విశ్వరూపం” సినిమా 2013 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. ఆ సినిమాను అడ్డుపెట్టుకొని “విశ్వరూపం 2” ని కూడా వాడుకోవాలనుకున్న నిర్మాతలకు ఐదు సంవత్సరాల తరువాత కమల హాసన్ చొరవతో విడుదల చేసారు. మొదటి భాగం హిట్ కావడంతో రెండొవ భాగంపై ఆసక్తి నెలకొంది.

ఏళ్లకు ఏళ్ళు రిలీజ్ డిలే అయిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించిన దాఖలాలు లేవు. అలానే “విశ్వరూపం 2” పై కూడా రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ కూడా నెగటివ్ రావడంతో సినిమా మొదటి రోజే డ్రాప్ అవ్వడం మొదలుపెట్టింది.  ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో ప్రచురించిన దాని ప్రకారం “విశ్వరూపం 2” సినిమాను కమల్ రిక్వెస్ట్ తో కొనడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాపై పాతిక కోట్లు పైనే నష్టం వచ్చేలా ఉందని తెలుస్తుంది.

కమల్ హాసన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత విడుదలైన మొదటి సినిమాపై కమల్ అభిమానులు చాల ఆసక్తిగా ఎదురుచూసారు. కానీ సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో కమల్ అభిమానులను బాగా నిరుత్సాహ పరచినట్లు తెలుస్తుంది. ఇక కమల్ ఒకటి, రెండు సినిమాలు తరువాత సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాలకే పరిమితమయ్యేలా ఉన్నదని తెలుస్తుంది.