కత్తి మహేష్ ఈపేరు బిగ్ బాస్1 సీజన్ తరువాత ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. బిగ్ బాస్ ద్వారా ఎక్కువ లాభ పడింది ఎవరైనా ఉన్నారంటే అది కత్తి మహేష్ ఒక్కడే. కత్తి మహేష్ అంతకు ముందు నుంచే సినిమాలకు రివ్యూస్ ఇస్తూ క్రిటిక్ గా కొందరికి పరిచయం. బిగ్ బాస్ తరువాత తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమయ్యి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముందుండేవాడు. కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్న లాలూచీతో ఒక సమయంలో కత్తి మహేష్ ను హత్యా చేస్తామని, దారుణాతి దారుణమైన బూతులు తిడుతూ పవన్ అభిమానులు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కొన్ని రోజులకు ఇండస్ట్రీ పెద్దలు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి సర్ది చెప్పారు. తరువాత కాస్టింగ్ కోచ్ పై కత్తి మహేష్ చేయాల్సినంత రగడ చేసాడు. అది కూడా ముగిసింది.

ఇక కత్తి మహేష్ ఖాళీగా ఉన్నాడు, అతనికి ఏదో ఒక కాంట్రేవర్సీ కావాలని సృష్టించుకుంటాడో, లేక ఇంకా ఏదైనా ఆశించి చేస్తాడో తెలియదు కానీ కత్తి మాట్లాడితే అది ఒక సంచలనం లాగా తెలుగు రాష్ట్రాలలో తయారైపోయినది. అలాంటి కత్తి హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపైనే కాంట్రేవర్సీ కామెంట్స్ చేసాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యల దూమారం ఎంత వరకు వెళ్లిందంటే కత్తిని తెలంగాణ రాష్ట్రము నుంచి బహిష్కరణ చేసే వరకు వెళ్ళింది. ఆరునెలల పాటు నగరంలో కానీ, ఈ చుట్టూ పక్కల కానీ కత్తి మహేష్ కనపడకూడదని తెలంగాణ పోలీసులు ఆదేశించారు.

ఇక కత్తి వ్యాఖ్యలతో ప్రముఖ స్వామిజి పరిపూర్ణానంద తీవ్రంగా కండించారు. అతనితో పాటు హిందూ మాత పెద్దలు కూడా తోడై కత్తి చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. స్వామిజితో పాటు పలు హిందూ సంఘాలు కత్తి వ్యాఖ్యలపై మండిపడుతున్న వేళ, కత్తి మరో సారి నేను రాముడిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పి మరో సారి అగ్గి రాజేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కత్తి మహేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. కత్తి చేసిన వ్యాఖ్యలపై స్వామిజి ధర్మాగ్రహ యాత్ర చేపట్టారు. దీనిపై కత్తి మహేష్ ను ఆరునెలలపాటు బహిష్కరించారు. అంతే కాకూండా పరిపూర్ణానంద చేపట్టిన ఆ యాత్రకు బ్రేక్ వేసి అతనిని కూడా ఆరునెలలు పాటు బహిష్కరించారు. స్వామీజీని బహిష్కరించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దీనిపై మాట్లాడిన కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ తన కొడుకు చేసిన పనిని సమర్ధించారు. నాకొడుకుని కాదని హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశం నుంచే బహిష్కరించాలని తెలియచేసాడు. కత్తి మహేష్ దళితుడు కాబట్టే, బ్రాహ్మణులంతా కలసి కత్తి మహేష్ పై కక్ష కట్టారని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలియచేసాడు. నా కొడుకు హిందువేనని, నాకొడుకు నాస్తికుడు కాదు… ఆస్తికుడే అని కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ తెలియచేసాడు. తన కొడుకు భార్యతో కలసి లేడని ప్రచారం చేస్తున్నారని, తన కొడుకు తన భార్యతో కలసి ఉన్నాడని, ఈనెల 4న జరిగిన కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు లక్నో వెళ్లి వచ్చానని ఓబులేష్ తెలియచేసాడు.

Tags : kathi MaheshParipoornananda Swamy, Hindus, Dalits, Kathi Mahesh Father Vobulesh