Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం పూర్తయింది. బేబక్క ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయింది. రెండవ వారం నామినేషన్ల ఘట్టం కూడా పూర్తయింది. ఎలిమినేషన్ కు దగ్గరైంది వీరే అంటూ నెటిజన్లు కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సీజన్ 8 రెండు వారాలు కూడా పూర్తి చేసుకోని బిగ్ బాస్ ఛాలెంజింగ్ టాస్క్‌లతో దూసుకుపోతోంది. తొలివారం హీటెక్కించిన నామినేషన్ రెండోవారం కూడా అదే రేంజ్ లో జరిగింది. సాధార ణంగా తెలుగు బిగ్ బాస్ లో మహిళలకు అన్యాయం జరుగుతుంద న్న వార్త మళ్లీ తెర పైకి వచ్చింది. గత ఏడు సీజన్లను పరిశీలిస్తే.. ఏడు సీజన్లలో దాదాపు 5 మంది మహిళలు తొలినాళ్లలోనే ఎలిమినేట్ అయ్యారు.
ఇక ఇప్పుడు రెండో వారంలో కూడా మహిళలు ఎలిమినేట్ అవుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా మంగళవారం రాత్రి నుంచి ఓటింగ్ లైన్లు తెరుచుకోగా, ఎవరూ ఊహించని విధంగా యాంకర్ విష్ణు ప్రియ టాప్ ప్లేస్ కు చేరుకుంది. దీనికి కారణం సోనియా అని చెప్పొచ్చు. నామినేషన్ సందర్భంగా విష్ణుప్రియను దారుణంగా అవమానించిన ఆమె.. వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. బట్టలు సరిగా వేసుకోమని సోనియా దురుసుగా మాట్లాడి తన ఇమేజ్ ని తగ్గించుకున్నారు. దీంతో సోనియాపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
దీనికి తోడు సోనియా హద్దమీరి మాట్లాడుతుండగా విష్ణుప్రియ ఉద్వేగానికి లోనుకాకుండా ధైర్యంగా ఆమె మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఓటింగ్‌లో విష్ణు అగ్రస్థానంలో ఉండగా, నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికీ పెద్దగా తేడా లేదని చెప్పొచ్చు. విష్ణు ప్రియ 26%, నిఖిల్ 24% ఓటింగ్‌తో ముందంజలో ఉన్నారు. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో నాగమణికంఠ, నాలుగో స్థానంలో నైనిక నిలిచారు. శేఖర్ భాషా ఐదో స్థానంలో, ఆదిత్య ఓం ఆరో స్థానంలో నిలిచారు. ఇద్దరి మధ్య ఒక శాతం ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. చివరి స్థానంలో పృథ్వీ, సీత అన్నారు. ఇద్దరికీ తక్కువ ఓట్లు రావడంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఈ వారం సీత ఎలిమినేట్ అయ్యే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సీత నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఆమెకు సంబంధించిన పోస్టింగ్‌లు కనిపించకపోవడమే దీనికి కారణం. పృథ్వీ కంటే సీత బలమైన పోటీదారు. అయితే ఆమెకు సంబంధించిన ప్రమోషన్స్ లేకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం వరకు జరిగే ఓటింగ్‌ను బట్టి ఎలిమినేషన్‌పై స్పష్టత వస్తుంది. మరి ఈసారి కూడా సీత ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ హౌస్ లో మహిళలకు అన్యాయం జరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు.