Friday, October 4, 2024

Bigg Boss: మూడో వారం ఎలిమినేట్ అవుతున్న అభయ్ నవీన్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

- Advertisement -


Bigg Boss: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వన్ అండ్ ఓన్లీ రియాల్టీ షో బిగ్ బాస్. 8వ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు, అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారంలో ఎలిమినేషన్లో భాగంగా అభయ్ ఎలిమినేట్ కానున్నాడని సమాచారం. మూడో వారం నామినేషన్‌లో భాగంగా..ప్రేరణ, యష్మీ గౌడ, పృథ్వీ, నైనిక, మణికంఠ, సీత, విష్ణుప్రియ, అభయ్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మూడో వారం నుంచి అభయ్ ఎలిమినేట్ అవుతాడనేది తాజా సమాచారం.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఈ షో మొదట్లో చాలా స్లోగా నడిచింది. కానీ మూడో వారంలో టాస్క్ లు ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు అద్భుతంగా ఉండటమే కాకుండా అభయ్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు. టాస్క్‌లు ఆడి ఓడిపోయినా పర్వాలేదు కానీ చీఫ్ గా వ్యవహరిస్తూ ఓ మూల కూర్చోవడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. నిన్నటి గుడ్డు సేకరణ టాస్క్‌లో అభయ్ ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా ఇతర క్లాన్ కు చెందిన వాళ్లు తన వద్దకు వచ్చి కోడిగుడ్లు దొంగిలిస్తే సంబరాలు చేసుకోమని చెప్పి వదిలేశాడు. ఓ వైపు యష్మీ, ప్రేరణ, మణికంఠలు బాగా పోరాడి ఆడుతున్నారు.. నిఖిల్ క్లాన్ తో గొడవపడి గుడ్లు గెలుస్తుంటే.. దాన్ని తేలిగ్గా వదిలేయడం హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి తోడు అభయ్ బిగ్ బాస్ ను దుర్భాషలాడుతూ ఇదేం పనికిమాలిన గేమ్ అని నెగెటివిటీ క్రియేట్ చేసాడనే చెప్పాలి. ఇక ప్రేక్షకులు తనను రక్షిస్తారనే నమ్మకంతో ఈ వారం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో నామినేషన్ లోకి వచ్చాడు. దీనికి తోడు కంటెస్టెంట్ గా ఫెయిల్ అవ్వడమే కాకుండా చీఫ్ గా డిజాస్టర్ గా నిలిచాడు. అందుకే రోజువారి ఓట్ల కంటే కూడా తగ్గాయి.

ప్రస్తుతం అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మూడు వారాలకు ఎంత ఇస్తున్నారనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో పాపులర్ అయిన సెలబ్రిటీ కావడంతో అతనికి వారానికోసారి రూ.3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం అభయ్ వారానికి 3 లక్షలు అంటే 3 వారాలకు 9 లక్షలు. నిజానికి మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కరెక్ట్ గా గేమ్ ఆడితే కచ్చితంగా టాప్ 5లో చేరి ఉండేవాడు.. అయితే రిలాక్స్ కావడానికే బిగ్ బాస్ కి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా అభయ్ టాస్క్ లు ఆడకుండా అభ్యంతరకరంగా మాట్లాడడంతోనే ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!