బిగ్ బాస్ 2 వారం, వారం గడుస్తున్నా కొద్ది మంచి రసవత్తరంగా నడుస్తుంది. ప్రతివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో ముందుగానే తెలిసిపోతుంది. ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరో ఇంత వరకు బయటకు రాకపోయినా కొన్ని యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియాలో జరిపిన పోల్స్ ప్రకారం అందరూ ముక్తకంఠంగా దీప్తి సునైనా పేరు చెబుతున్నారు. మొదట్లో బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా కనిపించినా తరువాత హౌస్ లో ఎటువంటి పెర్ఫార్మన్స్ ఇవ్వకుండా కొంత బద్ధకంగా ఉంటుందని విమర్శలు వచ్చాయి.

నిన్న జరిగిన టెలిఫోన్ టాస్క్ లో కౌశల్ తో కొంత రూడ్ గా మాట్లాడటంతో దీప్తి సునైనాపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అసలే కౌశల్ ఆర్మీ దెబ్బకు కౌశల్ తో ఎవరు గొడవ పెట్టుకుంటే వారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు సాగనంపుతున్నారని ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్న సబ్యులకు కూడా అర్ధమైంది. కానీ నిన్న దీప్తి సునైనా ఇంత తెలిసి కూడా కౌశల్ తో గొడవ పెట్టుకోవడంతో సోషల్ మీడియా వేదికగా కౌశల్ ఆర్మీ దీప్తి సునైనాను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు తనీష్, సామ్రాట్ లను అడ్డుపెట్టుకొని బిగ్ బాస్ హౌస్ లో నెట్టుకొచ్చిన దీప్తి సునైనాకు ఇక ఈవారంతో బయటకు రావడం తధ్యమని నొక్కి చెబుతున్నారు. చూద్దాం అనుకున్నట్లు దీప్తి సునైనా వస్తుందా? లేక మరెవరైనా బయటకు వచ్చి ఈ చిన్నది సేఫ్ జోన్ లో ఉంటుందా ఈ ఆదివారం వరకు వేచి చూద్దాం.