Bigg Boss 8: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 20వ ఎపిసోడ్ ప్రభావతి 2.0 టాస్క్ పూర్తయింది. ఈ టాస్క్‌లో అత్యధిక గుడ్లు సాధించిన నిఖిల్ క్లాన్ విజయం సాధించింది. అలాగే, బిగ్ బాస్ తరువాత తన టీమ్ క్లాన్‌లో ఎవరికి శక్తి టీం చీఫ్ అయ్యే అర్హత ఉందో వారికి తన వద్ద ఉన్న రెడ్ కలర్ గుడ్డు ఇవ్వాలని నిఖిల్ ను బిగ్ బాస్ ఆదేశిస్తారు. ఎవరికైతే రెడ్ కలర్ గుడ్డు ఇస్తారో వారు కూడా చీఫ్ కంటెస్టెండర్ అయ్యే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. అలాగే ఓడిపోయిన అభయ్ క్లాన్ నుంచి ముగ్గురు చీఫ్ కంటెండర్స్ అయ్యే అవకాశం ఉందన్నారు. అభయ్ మినహా మిగతా అందరికీ ఆ అవకాశం ఉందని బిగ్ బాస్ తెలిపారు. దీంతో నిఖిల్ టీమ్ కాస్త నిరుత్సాహానికి గురైంది. అంత కష్టపడి గెలిస్తే మాలో ఒక్కరికేనా ఛాన్స్ అని పృథ్వీరాజ్, సీత అనుకుంటారు. తరువాత తన రూల్స్ , టాస్క్ లను వ్యతిరేకించడం పై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ సీరియస్ అయిన దాని గురించి కూడా అభయ్, ప్రేరణ, నబీల్ మిగతా వారు డిస్కషన్ పెట్టుకున్నారు. అనంరం స్విమ్మింగ్ పూల్ లో పృథ్వీ దిగాడు. ఈ విషయం యష్మీ గౌడ, ప్రేరణ, సీత, నైనికతో ఉన్న విష్ణుప్రియ చెబుతుంది.
వీరితో పాటు విష్ణుప్రియ పక్కనే నాగ మణికంఠ కూడా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ లో దిగిన పృథ్వీని.. విష్ణుప్రియ చూసి చెప్పింది. అవి కళ్లా.. స్కానర్లా అని మణికంఠ అన్నారు. నేను పృథ్వీనే కాదు మిగతా వాళ్లకు లైన్ వేస్తున్నాను అని విష్ణు ప్రియ అంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు అబ్బాయిలు అంటూ సీత అడిగితే.. అప్పుడు ఎదురుగా ఉన్న యష్మీ గౌడ, ప్రేరణలో ఒకరు నాగ మణికంఠ అని డౌట్‌గా చూపించారు. వెంటనే విష్ణుప్రియ అలర్ట్ అయి నీకెవరు లైన్ వేస్తారు.. నీకు పెళ్లయింది కదా అని అతడితోనే డైరెక్ట్ గా చెప్పి పరువు తీసేసింది. దాంతో అంతా నవ్వేశారు. మణికంఠ కూడా నవ్వుతాడు. ఆదిత్య గారికి కూడా అని సీత సరదాగా అడుగుతుంది. హా అవునే వేస్తున్నాను అంటూ వెటకారంగా ఆన్సర్ ఇస్తుంది విష్ణు ప్రియ. ఆదిత్య ఓం గారి కళ్లు బాగుంటాయని.. తనకు ఇష్టమని విష్ణు ప్రియ చెబుతుంది.
తరువాత కాసేపటికి నువ్వు నన్ను హగ్ చేసుకున్నప్పటి నుంచి ప్రేమ మొదలైందన్నట్లుగా నాగ మణికంఠతో విష్ణుప్రియ చెప్పింది. దాంతో నిజమారా… థ్యాంక్స్ రా అయితే మళ్లీ హగ్ చేసుకుంటా అని ముందుకు వస్తాడు నాగ మణికంఠ. దానికి విష్ణుప్రియ వద్దు నో అనుకుంటూ లేచి నిల్చోని పక్కకు వెళ్లిపోతుంది. ఇలా హౌజ్‌లో లవ్ ట్రాక్స్‌పై ఫన్నీగా కావాలనే డిస్కషన్ పెట్టింది విష్ణుప్రియ. కాగా, బిగ్ బాస్ 8 తెలుగు మూడో వారం నామినేషన్లలో మొత్తం 8 మంది ఉన్నారు. వారిలో విష్ణుప్రియ, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, యష్మీ గౌడ, ప్రేరణ, నైనికా, పృథ్వీరాజ్.. తనను తాను నామినేట్ చేసుకున్న అభయ్ ఉన్నారు. వారిలో నైనికా, అభయ్ ఎలిమినేషన్ కోసం డేంజర్ జోన్‌లో ఉన్నారు.