వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. ఈ సినిమాను డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తీసాడని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్మూట్టి ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

కాగా యాత్ర సినిమాను అమెజాన్ సంస్థ 8 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంటే దాదాపు సగం పెట్టుబడి ఈ హక్కుల ద్వారా తిరిగి వచ్చినట్టే. హిందీ డబ్బింగ్ బేరాలు సాగుతున్నాయి. అది ఒక కోటి వరకు ఉంటుంది. ఇంకా శాటిలైట్ వుండనే వుంది. కొన్ని ఏరియాల అమ్మకం ద్వారా కొంత వచ్చింది. మొత్తం మీద యాత్ర సినిమా బాగానే లాభాలు ఆర్జించిందని చెప్పవచ్చు.