వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహించారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనబడే తెలుగు భాష అంటే తనకు ఎంతో గౌరవం అన్నారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. నేను తెలుగు మాట్లాడలేను కాని.. తెలుగు అర్ధం చేసుకుంటానని.. ఆ భాష అన్నా తెలుగు ప్రేక్షకులన్నా చాలా ఇష్టం అంటూ తెలుగు భాషపై ప్రశంసలు కురిపించారు. అందుకే ఈ సినిమాకి సంబంధించి స్వయంగా తెలుగులో డైలాగ్‌లు ముందే తీసుకుని నేర్చుకున్నాను. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. అంతలా ఈ సినిమా ప్రభావం నాపై పనిచేసింది అన్నారు మమ్ముట్టి.

కాగా ఈ చిత్రంలో మమ్మూట్టి.. వైఎస్సార్ పాత్రలో నటించడం ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ‘యాత్ర’ సినిమా వైఎస్సార్ అభిమానులకే కాదు.. ఆయన అభిమానులు కాని వారికి కూడా నచ్చుతుంది. అందరికీ నచ్చే స్ఫూర్తిదాయకమైన సినిమా ఇది. ‘యాత్ర’ అన్ని పొలిటికల్‌ పార్టీలు చూసే చిత్రం. వారందరికీ మంచి స్ఫూర్తిగా ఉంటుందనే నమ్మకం నాకుందని హీరో సుధీర్‌బాబు అన్నారు. కాగా ఈ సినిమాను శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతుంది.