వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహి.వి.రాఘవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైఎస్సార్ గా మమ్మూట్టి నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.

ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. అలాగే యాంకర్ అనసూయ రాయలసీమకు చెందిన రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

https://youtu.be/AzvDmOo3l9k