దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ డైరెక్ట్ చేసిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా మిగతా పాత్రల్లో స్టార్ నటి నటులు నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. యూఎస్ లో ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ సేల్ మొదలైంది. యూఎస్ లోని సీటెల్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ను ఆన్లైన్ లో సేల్ చేశారు. ఫస్ట్ టికెట్ ధర ఏకంగా రూ.4.37 లక్షల రూపాయలు పలికింది. సీటెల్ కు చెందిన ఎన్ఆర్ఐ మునీశ్వర్ రెడ్డి ఈ టికెట్ ను దక్కించుకున్నాడు.

ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ కు మంచి టాక్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ బయోపిక్ నిడివి కేవలం 126 నిమిషాలు మాత్రమే ఉండటంతో ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమా ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని టికెట్ దక్కించుకున్నవాళ్ళు అంటున్నారు.