Sunday, September 8, 2024

గుడివాడ కొడాలి నానిదే.. ఓడించే సత్తా చంద్రబాబుకు లేదా..?

- Advertisement -

ఏపీలో ప్రతిపక్ష పార్టీలో రాజకీయాలు ఒకలా ఉంటే.. అధికార పక్షంలో రాజకీయాలు మరోలా ఉన్నాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకో బోతున్నారు ? వాటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ముందస్తు ఎన్నికలు ఉంటే ఎప్పుడు ఉంటాయి? అనే టెన్షన్ నడుమ ఎవరి స్థాయిలో వారు రాజకీయాలు మొదలు పెట్టారు.. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుండి మరో ఎత్తు అంటుంది.

అధికార పార్టీ ఎన్ని ఎత్తులు వేసిన మేము గెలవడం పక్కా అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు. కానీ ఇటు వైసీపీ కూడా తగ్గడం లేదు.. ఎవరు ఎన్ని చేసిన నేను గెలవడం మాత్రం ఖాయం అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని.. తనపై పోటీకి ఎవ్వరు దిగిన గెలుపు మాత్రం నాదే అంటున్నాడు. లోకేష్ పోటీకి వచ్చినా లేదంటే ఆయన బాబు చంద్రబాబు బరిలోకి దిగినా సరే ఓడించడం ఖాయం అంటున్నాడు. దీంతో చంద్రబాబు కూడా ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలి అని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది.

అందుకే సరైన అభ్యర్థి కోసం టీడీపీ పార్టీ వేట మొదలు పెట్టింది.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి కుప్పం ఎంత ముఖ్యమో గుడివాడ కూడా అంతే ముఖ్యంగా మారింది. మరి గుడివాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి.. అనేది అందరిలో ఆసక్తిగా మారింది. గుడివాడ రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి.. మరి అలాంటి గుడివాడలో ఐదవసారి కూడా పోటీకి సిద్ధం అయ్యారు కొడాలి నాని.. ఈయన ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు.. ఇప్పుడు ఐదవ సారి కూడా గెలవడం పక్కా అంటున్నారు.

ఈయన ఫైర్ బ్రాండ్ గా వైసీపీలో పేరు తెచ్చుకున్నారు.. మైక్ అందుకుంటే చంద్రబాబు, లోకేష్ లకు ఆ రోజు తిట్లతోనే వడ్డించడం కొడాలి నానికి అలవాటు.. మరి కొడాలి నాని గెలుపు పక్కా అని వైసీపీ చెబుతుంటే అలా జరగకుండా చూడాలని టీడీపీ గట్టి ప్రయత్నం చేస్తుంది.. కొడాలి నానిని ఢీకొట్టే సరైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు గుడివాడపై స్పెషల్ ఫోకస్ పెట్టింది టీడీపీ.. మరి టీడీపీ భావిస్తున్నట్టు కొడాలి నానిని ఓడించడం వారికీ సాధ్యం అవుతుందా? ఈసారి గుడివాడలో ఏ పార్టీ తరపున ఎవరు బరిలోకి దిగబోతున్నారు?

కొడాలి నాని గుడివాడలో వరుసగా నాలుగుసార్లు పోటీ చేసి గెలిచారు. రెండు సార్లు టీడీపీ తరపున గెలిస్తే మరో రెండు సార్లుగా వైసీపీ తరపున గెలిచారు. అయితే టీడీపీ తరపున వెనిగండ్ల రాముతో పాటు రావి వెంకటేశ్వరరావు బరిలో ఉండడంతో ఇక్కడ గ్రూపు రాజకీయాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి.. కింది స్థాయి కార్యకర్తలు కూడా ఏ నాయకుడితో కలిసి పని చేయాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఒక అభ్యర్థి పేరును ప్రకటిస్తే అందరు కలిసి పనిచేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే కొడాలి నానికి మాత్రం ఢీ కొట్టే మరో నాయకుడు లేడు. ఈయన గత 20 ఏళ్లుగా అక్కడ ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు.. అందుకే ఈయనను ఓడించడం అంత సులువు కాదు అనే చెప్పాలి.. చూడాలి చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారో..

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!