టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీ వర్గాలు. పైకి అంతా బాగానే ఉన్నప్పటి కూడా లోపల్ మాత్రం మ్యాటర్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అసలు తండ్రి , కొడుకుల మధ్య గ్యాప్ రావడానికి గల కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనే తెలుస్తోంది. అవును పవన్ కల్యాణ్ వల్లనే చంద్రబాబు , నారా లోకేష్ తలెత్తినట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాలను చావు దెబ్బ కొట్టి మరి అధికారం చేపట్టారు వైసీపీ అధినేత జగన్. తిరిగి 2024లో కూడా 2019లో వచ్చిన మెజార్టీ కన్నా కూడా ఎక్కువుగా రావాలని నాయకులకు దిశ నిర్ధేశం చేశారు.
జగన్ అమలు చేస్తున్న పథకాలన్ని కూడా వైసీపీకే మొగ్గు చూపిస్తున్నాయి. ఈక్రమంలో ప్రతిపక్షాలు అన్ని కూడా ఒకటవుతున్నాయి. ముఖ్యంగా జగన్‌ను ఎదుర్కొవాలంటే టీడీపీ, జనసేన ఒకటి అవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం అయిపోయింది. ఇప్పటికే ఇరువురు పార్టీల నేతలు.. పలుమార్లు భేటీ కూడా అయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సంఖ్య పంపకం తేలాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు చంద్రబాబు , నారా లోకేష్ మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ టీడీపీతో కలవడం అసలు ఇష్టం లేదని సమాచారం అందుతుంది. టీడీపీ , జనసేనలు కలిసి పోటీ చేస్తే ప్రజల్లోకి వేరేగా సంకేతాలు వెళ్తాయని లోకేష్ భావిస్తున్నారు.
జగన్‌ను ఒంటరిగా ఢీ కొట్టలేకనే టీడీపీ , జనసేనలు కలిసి పోటీ చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసుకుంటుందని..అది తనకు ఇష్టం లేదని..అయిన టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీని ఓడిస్తుందని లోకేష్ భావిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి విజయం సాధిస్తే… ఆ క్రెడిట్ పవన్ కల్యాణ్‌కు వెళ్తుందని లోకేష్ వాదన. తరువాత కూడా దీనిపై చాలా సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని లోకేష్ భావిస్తున్నారు. ఈ కారణాలతోనే పవన్ కల్యాణ్‌తో పొత్తు వద్దని లోకేష్ వారిస్తున్నారు. కాని దీనిపై చంద్రబాబు వాదన మరొలా ఉంది. జగన్ ఇప్పటికే టీడీపీ మూలాలపై దెబ్బ కొట్టారని.. 2024 ఎన్నికల్లో కూడా జగన్ గెలిస్తే.. మరొ 20 ఏళ్లు టీడీపీ గెలుపు గురించి మార్చిపోవడమే అని చంద్రబాబు వాదిస్తున్నారు.
ఒంటరిగా వెళ్లి జగన్‌ను ఢీ కొట్టలేం కాబట్టి.. పవన్‌తో చేతులు కలపడమే మంచిదని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయినప్పటికి కూడా చంద్రబాబు మాటలతో ఏకీభవించని లోకేష్ .. తండ్రితో కాస్తా ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారట. అందుకే నారా లోకేష్ ప్రకటించిన యువగళం పోస్టర్‌లో ఎక్కడ కూడా తన తండ్రి ఫొటో కూడా పెట్టడానికి ఆయన ఇష్టపడలేదని తెలుస్తోంది. లోకేష్ వాదన కూడా కరెక్ట్‌గానే కనిపిస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. ఆ క్రెడిట్ పవన్‌కు కొట్టేయడం ఖాయం. ఇది ముందే గ్రహించిన లోకేష్.. జనసేనతో పొత్తు వద్దని వారిస్తున్నారు. పొత్తు కుదరక ముందే.. టీడీపీ, జనసేనల మధ్య ఇన్ని సమస్యలు ఉంటే.. పొత్తు కుదిరిన తరువాత ఇంకెన్ని సమస్యలు వస్తాయో చూడాల్సి ఉంది.