Thursday, November 7, 2024

నేరాలు ఘోరాలు చేసేస్తోన్న పవన్ కళ్యాణ్.! చిరంజీవి పరిస్థితేంటి.?

- Advertisement -

‘మా అమ్మ దీపాలు పెడితే.. వాటితో మా నాన్న సిగరెట్లు వెలిగించేవారు..’ అంటూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంపై పెను దుమారం రేగుతోంది. చిరంజీవి తండ్రికి కమ్యూనిస్టు భావాలుండేవి. ఆయన దేవుళ్ళను నమ్మరు. నాగబాబు కూడా అంతే.. ఆయనా దేవుళ్ళని నమ్మరు. మరీ, తండ్రి కొణిదెల వెంకట్రావులా కాదు. నాగబాబు కొంచెం అలా.. కొంచెం ఇలా. దేవుడ్ని నమ్ముతూనే, నమ్మనంటుంటారాయన.

ఎవరిష్టం వాళ్ళేది దేవుడి విషయంలో. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆంజనేయస్వామి భక్తుడు. అందరు దేవుళ్ళనూ కొలుస్తారాయన. పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు దేవుళ్ళని పెద్దగా నమ్మేవారు కాదు. ఆ తర్వాత అరివీర భయంకరమైన భక్తుడైపోయాడాయన. దానిక్కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో స్నేహం.. అంటారు కొందరు.

విశ్వాసాలు.. అభిప్రాయాల గురించి మాట్లాడుతూ.. ‘దీపం – సిగరెట్టు’ కథ చెప్పారు పవన్ కళ్యాణ్. కొన్నేళ్ళ క్రితం కొణిదెల వెంకట్రావు పరమపదించారు. మరి, ఆయన్ని ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్ వివాదాల్లోకి లాగినట్లు.? సిగరెట్ల చర్చ ఇప్పుడెందుకు.?

పవన్ కళ్యాణ్ మీద పొలిటికల్ ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే.. ఇది మెగాస్టార్ చిరంజీవికి అత్యంత అవమానకరమైన విషయం. మీడియా చిరంజీవిని ఈ విషయమై ప్రశ్నిస్తే ఆయన ఔననీ చెప్పలేరు.. కాదనీ అనలేరు. ‘వాడు నా తమ్ముడు మాత్రమే కాదు.. నా బిడ్డతో సమానం..’ అని చిరంజీవి చెబుతుంటారు. తప్పు కదా పవన్ కళ్యాణ్.. తండ్రి లాంటి అన్నయ్యను ఇరకాటంలో పడేయడం.?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!