Thursday, November 7, 2024

మంత్రి రోజాకు బాలయ్య ఆహ్వానం..దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిర్ ఫైర్ బ్రాండ్

- Advertisement -

గత కొద్దిరోజులుగా మంత్రి రోజాను టీడీపీ నాయకులు కన్నా కూడా జనసేన పార్టీనే ఎక్కువుగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. నాగబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా రోజాను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా వారి సోషల్ మీడియాలో రోజాను ట్రోల్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. మొన్న జరిగిన జనసేన సభలో కూడా పవన్ కల్యాణ్ .. రోజాను డైమాండ్ రాణి అని సంభోదించడం జరిగింది. దానికి రోజా కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. . పొలిటికల్ జోకర్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పవన్‌పై ఘాటు విమ‌ర్శలు చేశారు. రెండుసార్లు గెలిచిన తాను ఎక్కడ.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఎక్కడ అంటూ ఎద్దెవా చేశారు.

ఇదే సమయంలో తనకు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆన్‌స్టాప్‌బుల్ షోకు ఆహ్వానం అందిందని ఆమె తెలిపారు. అన్‌స్టాప‌బుల్ షోను మొద‌ట్లో బాల‌య్య బాగా చేశారని అనిపించింద‌న్నారు. త‌న‌ను కూడా ఆ షోకు పిలిచార‌న్నారు. అయితే అప్పుడు అసెంబ్లీ కార్య‌క‌లాపాలు ఉండ‌డం వ‌ల్ల వెళ్ల‌డానికి కుద‌ర్లేద‌న్నారు. బాల‌కృష్ణ‌, తాను క‌లిసి ఏడు సినిమాల్లో న‌టించామ‌న్నారు. త‌మ‌ది హిట్ కాంబినేష‌న్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలకృష్ణ సినిమాల్లో కంటే బయటే చాలా సరదాగా ఉంటారని రోజా పేర్కొన్నారు. ఫోన్లు పగులగొట్టడం, అభిమానుల చెంప పగులగొట్టడం వరకే ఆయనను చూసి ఉంటారని, ఆయనలో మరో కోణం ఉందని చెప్పారు. బాలకృష్ణ చాలా సరదా మనిషి అని అన్నారు. ఆయనతో ఏదైనా టాక్ షో ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతుందని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. అన్‌స్టాప‌బుల్‌కు వెళ్లాలని అనుకున్న‌ట్టు చెప్పారు.

షోకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను పిలిచి తప్పు చేశారని రోజా వ్యాఖ్యానించారు. వీళ్లంతా వచ్చిన తరువాత షో మొత్తం మారిపోయిందని, రాజకీయ వేదికగా మారిందని అన్నారు. ఎప్పుడో చనిపోయిన ఎన్టీఆర్‌ను ఇప్పుడు ఫూల్‌‌ను చేశారని కన్నతండ్రికి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తోంటే సహకరించిన బాలకృష్ణ.. దాన్ని మళ్లీ తెర మీదికి తీసుకొచ్చి సమర్థించుకున్నట్టయిందని అన్నారు. ఇదంతా చూస్తోంటే- బాలకృష్ణకు తండ్రి మీద కంటే కూతురి కాపురం మీదే ఎక్కువ ఇంట్రస్ట్ ఉన్నట్టుందని రోజా చెప్పుకొచ్చారు. అందుకే ఆ షోకు నేను వెళ్లలేదని ఆమె తెలిపారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!