Friday, April 19, 2024

టీడీపీలో మరో వికెట్ డౌన్..పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

టీడీపీలో మరొ వికెట్ పడింది. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా పార్టీ కీలక నేత ఒకరు ప్రకటించారు. కీలకమైన తూర్పు గోదావరి జిల్లాలో వరుసగా నాయకులు టీడీపీని వీడుతున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరిలో టీడీపీ తరుఫున పోటీ చేయడానికి నేతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో అధికార వైసీపీ పార్టీ బలంగా ఉంది.. కాపులు అధికంగా ఉండటం.. కొందరు జనసేన నుంచి బరిలోకి దిగాలని చూడటం మొదలగు అంశాలతో జిల్లాలో టీడీపీ రేసులో బాగా వెనుకపడింది. తాజాగా టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఇంతకి.. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే .. ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రతిపక్ష టీడీపీ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ పార్టీ వరుస దెబ్బలు తింటోంది. ఈ పార్టీ కేవలం 23 ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకుంది. టీడీపీ గుర్తుపై గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు, కరణం బలరాం, మద్దాలి గిరి వంటి ఎమ్మెల్యేలు టీడీపీని వీడి అధికార వైసీపీకి తమ మద్దతు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ అయిన పోతుల సునీత కూడా తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఇక ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడటానికి రెడీ అవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు ఏ క్షణం అయిన వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో చేరికపై గంటా కూడా అధికారిక ప్రకటన చేశారు.. గెలిచిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఓడిపోయిన వారి పరిస్థితి మరి దారుణంగా ఉందని తెలుస్తోంది. టీడీపీ తరుఫును గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలామంది నాయకులు ఆ పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. తోటా త్రిమూర్తులు, దేవినేని అవినాష్ వంటి నాయకులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో సీనియర్ టీడీపీ నాయకుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.తూర్పు గోదావరి జిల్లాలో రాజా నగరం నియోజకవర్గం కూడా ఒకటి. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా ఉండేది. అక్కడ నుంచి 2009 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా పెందుర్తి వెంకటేష్ గెలుపొందారు. కాని 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో పెందుర్తి వెంకటేష్ ఓడిపోవడం జరిగింది. వైసీపీ నుంచి పోటీ చేసిన జక్కంపూడి రాజా ఘన విజయం సాధించారు. అయితే ఇటీవలే టీడీపీ అధినేత రాజా నగరం నియోజకవర్గం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో.. ఇంచార్జ్ అయిన పెందుర్తి వెంకటేష్‌కు చంద్రబాబు ఫుల్ క్లాస్ పీకారట. రాజా నగరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాలేదని.. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలకు తీవ్ర మనస్తాపానికి గురయ్యే పెందుర్తి వెంకటేష్ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేసినట్టు ఆయన అనచరులు చెబుతున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన పెందుర్తి వెంకటేష్ టీడీపీకి రాజీనామా చేయడం .. తూర్పూ గోదావరి జిల్లాలో పార్టీకి తీవ్ర లోటే అని చెప్పాలి. పెందుర్తి వెంకటేష్ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!