బుల్లితెర ప్రెక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌-2’ హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రెండో సీజన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. జూన్ పదిన ప్రారంభమైన ఈ షో లో మొత్తం 16 మంది పాల్గొన్నారు. అయితే బిగ్‌బాస్‌ నుండి బాబు గోగినేని ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన వారిలో బాబు గోగినేని, తేజస్వీ, భాను శ్రీ, సంజన, కిరీటి ఉన్నారు. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా పూజ రామచంద్రన్‌ హౌస్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఈ షో 60 రోజులు పూర్తి చేసుకుంది.