బిగ్ బాస్ 2 తెలుగు ప్రేక్షకులను నాని తన హోస్టింగ్ తో బాగానే ఆకట్టుకునేలా చేస్తున్నాడు. నాని వచ్చిన రెండు రోజులు బిగ్ బాస్ రేటింగ్స్ బాగుంటున్నా, మిగిలిన రోజులలో కొంత డల్ గానే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 2 లో జరిగే విషయాలన్నీ ప్రేక్షకులకు ముందుగానే తెలిసిపోవడంతో కొంత బిగ్ బాస్ యాజమాన్యమే అసహనంతో ఉన్నారు. బిగ్ బాస్ మొదటి భాగం అంత పుణేలో సెట్ వేసి అక్కడ చేసారు.

బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక రోజు ముందు జరిగిన ఎపిసోడ్ ను చూపించడం జరుగుతుంది. పుణేలో మొదటి బిగ్ బాస్ సెట్ వేసినప్పుడు ప్రతి వారం ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్లైట్ లో హైదరాబాద్ రావడానికి కొంత సమయం పడుతుంది. మరలా అక్కడ పని చేసే వారు కూడా లోకల్ వారు కాకపోవడంతో లీకుల బెడద ఉండేది కాదు.

కానీ బిగ్ బాస్-2 మాత్రం హైదరాబాద్ నడిబొడ్డులోని అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేశారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వెంటనే ఇంటికి వెళ్లిపోవడం, ఆతృతగా పోస్టులు పెట్టడంతో ప్రేక్షకులు టీవీలలో షో ప్రచారం జరగక ముందే ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలిసిపోతుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి పని చేసేవారు కూడా ఇక్కడి వారే కావడంతో షో లో ఏమి జరుగుతుందో ముందుగానే వారికి తెలియడంతో, చేర్చవలసిన వారికి ముందుగానే షో వివరాలు తెలియచేస్తున్నారు. దీనితో బిగ్ బాస్ యాజమాన్యానికి ఏమి చేయాలో తోచక తల పట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు వారిని తొలగించే పరిస్థితి కూడా లేదని, లీకులు రాకుండా జాగ్రత్త పడటం తప్ప, ఏమి చేయలేని పరిస్థితులలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది.