ఈరోజు వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నగరంలో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సభలో బ్రాహ్మణుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం ఏవిధముగా మోసం చేస్తుందో వైఎస్ జగన్ తన ప్రసంగంలో తెలియచేసారు. ఇదే వేదికపై నుంచి బాపట్ల వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంత వరకు ఎవరని మోసం చేయలేదని నమ్మిన వారే వైఎస్ జగన్ ను మోసం చేసారని తెలియచేసారు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైఎస్ జగన్ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసారని, ఇంత వరకు వైఎస్ జగన్ పై వారు పెట్టిన ఏ కేసు కూడా నిలబడే పరిస్థితి లేదని, ప్రజా సమస్యలపై ఏ నాయకుడు చేయనన్ని పోరాటాలు వైఎస్ జగన్ చేసారని కోన రఘుపతి తెలియచేసారు. ఆదివారం వైఎస్ జగన్ కంచరపాలెంలో నిర్వహించిన సభకు హాజరైన జనసునామిని చూసి చంద్రబాబు నాయుడు పెట్రోల్ పై 2 రూపాయలు తగ్గించారని ఎద్దేవా చేసారు. ఈ సభకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా హాజరయ్యారు.

వైసిపి ఎమ్మెల్యే ఆరోపించినట్లు చంద్రబాబు నాయుడు పెట్రోల్ రేటు రెండు రూపాయలు తగ్గించినా ఇంకా అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు అసెంబ్లీలో పెట్రోల్ గురించి మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి రాకుండా పెట్రోల్ రేటుపై నిరసన తెలపకుండా మోదీ ప్రభుత్వానికి బయపడి దాకున్నారని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కన్నా ప్రజల దగ్గర అధిక దోపిడీకి పెట్రోల్ పై వసూళ్లు చేస్తూ నీతులు చెప్పడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి.