ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి లోకేష్ అధికారమే లక్ష్యంగా చేసుకొని వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగం, ప్రజా సమస్యలు, అలాగే అక్రమ కేసులు వంటి ప్రధాన అంశాలను టార్గెట్గా చేసుకొని లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్రకు సంబంధించిన కార్యచరణ కూడా సిద్ధం చేస్తున్నారట తమ్ముళ్లు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సాగనున్న ఈ పాదయాత్ర కు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది ప్రతిపక్ష పార్టీ.
అయితే ఈ పాదయాత్రను తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచిస్తోన్నారా… అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారా … దానితోపాటు ఒక టీంను కూడా రెడీ చేసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల మధ్య… టిడిపి పాదయాత్రలో లోకేష్ చేయబోయే విమర్శలన్నింటిని తిప్పికొట్టేందుకు వైసీపీ సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…
అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు కీలక నాయకులను అలాగే కోస్తా నుంచి మరో ముగ్గురు నాయకులను రాయలసీమ నుంచి ఇద్దరు నాయకులను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే ముఖ్యంగా ఈ లిస్టులో మంత్రి రోజా అలాగే మాజీ మంత్రి కొడాలి నానిల పేర్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరిని తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి… మొత్తానికి చూస్తే లోకేష్ పాదయాత్రను ఇరుకున పెట్టేందుకు సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాదయాత్రను లోకేష్ ఎలా సక్సెస్ చేస్తారు చూడాలి…