వైఎస్ జగన్ అనుచరుడు దంతులూరి కృష్ణను ఈరోజు గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసారు. దంతులూరి కృష్ణపై ఇటీవలే భూవిధానికి సంబంధించి కేసు నమోదైనది. దానిపై ఈరోజు నాంపల్లి కోర్ట్ కు హాజరై తిరిగి వెళ్తుండగా కృష్ణను వెంబడించిన దుండగులు కృష్ణ అనుచరులను కొట్టి, కృష్ణను అపహరించారని చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరు కిడ్నాప్ చేశారనే కోణంలో ఆరా తీస్తునట్లు తెలుస్తుంది. కడప జిల్లా పులివెందులకు చెందిన కృష్ణ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో పులివెందుల పరిసర ప్రాంతాలలో యాక్టీవ్ గా ఉండేవారు. దంతులూరి కృష్ణ భార్య గతంలో సర్పంచ్ గా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలిచారు. గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు కొంత మంది నుంచి ప్రాణాపాయం ఉందని సెక్యూరిటీ కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి అడిగినట్లు కూడా చెప్పుకొచ్చారు.