దీపావళి వస్తుందంటే తమ బడ్జెట్ నుంచి కాస్త మనీ పక్కకు తీసి పెట్టి పండగను ఉత్సాహంగా జరుపుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో ప్రతి కుటుంబం సరాసరిన క్రాకర్స్ కు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వరకు వెచ్చించేవారని, ఈసారి ప్రజలలో అంత ఎక్కువ ఆసక్తి కనపరచకపోగా, కొంత మంది సోషల్ మీడియా వేదికగా క్రాకర్స్ పై వారికి వారే నిషేధం విధించుకుంటున్నారు.

దీనంతటికి కారణం, ప్రజల జీవన విధానంలో మార్పులు, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహనకు తోడు సుప్రీం కోర్ట్ ఆంక్షలు కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తుంది. క్రాకర్స్ కొనుగోలులో వచ్చిన మార్పులతో హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం క్రాకర్స్ రేట్లు కూడా భారీగా పడిపోయాయని, దానికి జీఎస్టీ నిబంధనలు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

జిఎస్టీ నిబంధనలు వలన 385 రూపాయలు ఉన్న కాకరపూవత్తుల ప్యాకెట్ ఈసారి 268 రూపాయలకు పడిపోయిందని దానికి కారణం ప్యాకెట్ పై ముద్రించే రేట్లు ఆధారంగా జీఎస్టీ చెల్లించవలసి రావడంతో ప్యాకెట్ పై రేట్లు భారీగా తగ్గించవలసి వచ్చిందని, ఒకవైపున రేట్లు తగ్గిపోయి, మరో వైపు క్రాకర్స్ పై జనం ఆసక్తి తగ్గడంతో వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు.