Thursday, April 25, 2024

కొడాలి నాని గురించి అసలు నిజాలు బయటపెట్టిన దర్శకుడు వివి వినాయక్.. ఎన్టీఆరే దగ్గరుండి అంటూ

- Advertisement -

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా కొడాలి నానిని ఎన్టీఆర్ అభిమానే. హరికృష్ణ కుటుంబం ద్వారానే కొడాలి నాని రాజకీయంగా ఎదిగారనే విషయం అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని కొడాలి నాని కూడా అనేకమార్లు మీడియా ముందు చెప్పడం జరిగింది. హరికృష్ణను కొడాలి నాని దేవుడుతో సమానంగా కొలుస్తుంటారు. అలాగే హరికృష్ణ కొడుకు హీరో ఎన్టీఆర్‌ను కొడాలి నాని అమీతంగా ఇష్టపడుతుంటారు. అసలు ఎన్టీఆర్‌ను సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించింది కూడా కొడాలి నానినే అంటుంటారు. ఆయన ఇచ్చిన అండతోనే ఎన్టీఆర్ హీరోగా ఎదిగారని తెలుస్తుంది. ఇదే సమయంలో హరికృష్ణ .. కొడాలి నానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ..ఆయనకు గుడివాడ టీడీపీ అధ్యక్ష పదవి వచ్చేలా చక్రం తిప్పారు. కాని అందరికి షాకిస్తూ.. హరికృష్ణ బ్రతికి ఉండగానే .. కొడాలి నాని జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీలో చేరడం జరిగింది.

తాజాగా కొడాలి నాని, హరికృష్ణ, ఎన్టీఆర్‌ల గురించి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు దర్శకుడు వివి వినాయక్. హరికృష్ణ మరణం దగ్గర నుంచి ఎన్టీఆర్ ఆది , కొడాలి వైసీపీలో చేరడం మొదలగు విషయాలను మీడియాతో పంచుకున్నారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..అసలు ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాలనే కోరిక హరికృష్ణగారికి కన్నా కూడా కొడాలి నానికే ఎక్కువుగా ఉండేదని దర్శకుడు వివి వినాయక్ చెప్పుకొచ్చారు. ఆయన ద్వారానే ఆది సినిమా వచ్చిందని.. అసలు మొదట అనుకున్న కథ వేరని.. కొడాలి నాని ఇందులో ఎంటరై.. ఫుల్ మాస్ సినిమా కావాలని.. ఎన్టీఆర్ హీరోగా నిలబడే సినిమా తీయాలని ఒత్తిడి చేయడంతోనే..ఆది కథ పుట్టిందని వివి వినాయక్ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. కొడాలి నాని , హరికృష్ణగారు బంధం గురించి చెప్పాలంటే.. మాటలు సరిపోవని..వినాయక్ చెప్పుకొచ్చారు. హరికృష్ణగారు వెళ్లి ఆ నిప్పులో దూకు అంటూ ..ఎందుకు అని ప్రశ్నించడం చేతకాని వ్యక్తి కొడాలి నాని అని వినాయక్ పేర్కొన్నారు.

తనని హీరోగా నిలబెట్టిన కొడాలి నానిని అదే రకంగా రాజకీయంగా ఎన్టీఆర్ కూడా అండగా నిలబెట్టారని గుర్తు చేసుకున్నారు. కొడాలి నాని చెప్పింది నిజమే అని… ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబును కలిసి తనకు టిక్కెట్ ఇవ్వమని కోరింది లేదని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎన్టీఆరే కలుగుజేసుకుని కొడాలి నానికి గుడివాడ టిక్కెట్ వచ్చేలా చంద్రబాబుతో మాట్లాడారని..ఆ సమయంలో తాను కూడా ఎన్టీఆర్‌తోనే ఉన్నానని తెలిపారాయన. హరికృష్ణగారు చనిపోవడంతో అందరం బాధపడ్డామని.. కాని కుటుంబ సభ్యులు తరువాత అంతలా బాధపడింది మాత్రం కొడాలి నానినే అని తెలిపారు వినాయక్.

కారణాలు తెలియవు కాని.. చంద్రబాబు అంటే మొదటి నుంచి కూడా కొడాలి నాని దూరంగానే ఉండేవారని .. బహుశ ఆయన మనస్సులో సీనియర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచారని ఉండవచ్చు అనుకుంటా అని వినాయక్ తెలపడం జరిగింది. ఈమధ్య నేను కొడాలి నానికి కాల్ చేసి మాట్లాడాను.. ఎందుకు అలా తిడతావ్.. అని అడిగితే.. నీకు తెలియదులే దీని వెనుక చాలాఉందని చెప్పారని.. నేను కూడా అంతకు మించి అడగడం సరైంది కాదని అక్కడితో ఆగిపోయానని చెప్పుకొచ్చారాయన. ఇలా ఇంటర్య్వూ ఆసాంతం కూడా వివి వినాయక్ కొడాలి నాని గురించే మాట్లాడారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!