Thursday, March 28, 2024

వీళ్లు మనకు అవసరమా…?

- Advertisement -

దేశంలో అత్యంత బలంగా ఉన్న సీఎంలలో జగన్ కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఆయనకు 150 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల మద్దతు ఉంది. ప్రజల్లో కూడా జగన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. అంతకు మించి ఆయనపై నమ్మకం కూడా ఉంది. అందుకే వైసీపీ సర్కార్ వైపు చూడటానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా వెనకాడుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 9 ప్రభుత్వలను కూల్చి తమకు అనుకులంగా మార్చుకుంది. తెలంగాణలో కూడా తమ పాగాను వేయాలని ప్రయత్నించి విఫలం అయింది. కాని ఏపీలో మాత్రం జగన్‌ సర్కార్‌ను టచ్ చేసే సాహసం మాత్రం చేయడం లేదు.

ఇంత బలంగా ఉన్న జగన్… ఇద్దరు వ్యక్తులకు దగ్గర కావాలని ప్రయత్నించడం వైసీపీ శ్రేణులకు సైతం నచ్చడం లేదు. ఆ ఇద్దరు వ్యక్తులు మరెవ్వరో కాదు .. ఒకరు దేశ ప్రధాని మోదీ కాగ, రెండో వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరికి కూడా జగన్ అధిక ప్రాధాన్యతను ఇస్తూ.. వారికి దగ్గర కావాలని చూస్తున్నారు. అందుతో మొదటిగా ప్రధాని మోదీ గురించి చర్చించుకుంటే…దేశ ప్రధాని కాబట్టి మోదీకి తగిన గౌరవం ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదు. కాని బీజేపీ తమతోనే ఉందని చూపించుకోవాలని అధికార వైసీపీ పార్టీ భావిస్తుంది. 2024 ఎన్నికల్లో బీజేపీ తమతోనే ఉంటుందని చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది.

2014,2019 ఎన్నికలలో బీజేపీ మద్దతు లేకుండానే వైసీపీకి అండగా నిలిచారు ప్రజలు. కాని ఇప్పుడు కొత్తగా బీజేపీ తమతో ఉంటుందని చూపించుకోవాలని వైసీపీ తెగ ప్రయత్నిస్తుంది. బీజేపీ వైసీపీతో ఉంటే ఏంటీ లేకపోతే.. ప్రజలు జగన్‌కు అండగా ఉన్నప్పుడు బీజేపీ మద్దతు వైసీపీకి అవసరమా అనే అనుమానం పార్టీలోనే వ్యక్తం అవుతుంది. ఇక జగన్ దగ్గర కావాలని చూస్తున్న రెండో వ్యక్తి చిరంజీవి. జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. సినిమా టిక్కెట్ల విషయంలో కూడా చిరంజీవి చెప్పినట్లుగానే జగన్ చేశారు. అల్లూరి సీతరామరాజు విగ్రహాం ఆవిష్కరణలో కూడా చిరంజీవిని తన పక్కన కూర్చోపెట్టుకున్నారాయన. చిరంజీవి తమవాడే అనే చెప్పుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇదే సమయంలో చిరంజీవి కూడా జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు తమ మద్దతు ప్రకటించారు. కాని తాజాగా చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు అనుకులంగా ఉన్నాయి. పవన్ అనుకున్నది సాధిస్తాడు, అతను అత్యున్నత స్థాయికి ఎదుగుతాడని చిరంజీవి చెప్పుకొచ్చారు.పవన్ అనుకున్నది సాధిస్తాడంటే .. ఇక్కడ జగన్ ఓడిపోతాడనే కదా అర్థం. ఎప్పటికైనా అన్నదమ్ములు ఒకటౌవుతారు కాని.. జగన్ పల్లకిని చిరంజీవి ఎందుకు మోయాలని అనుకుంటారు. ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు కాబట్టే వైసీపీ నాయకులు చిరంజీవి మద్దతు కోరుకుంటున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. చిరంజీవికి ఓటర్లను ప్రభావితం చేసేంత శక్తి లేదని గ్రహించకపోవడం. అంతటి ప్రభావం చేసే వ్యక్తే అయితే ఆయనే తన సొంత నియోజకవర్గంలో ఓడిపోరు కదా. మరి ఇప్పటికైనా ఇది గ్రహించి.. పార్టీని క్షేత్రస్తాయిలో బలపరిస్తే .. ఎవరి మద్దతు లేకుండా మరోసారి జగన్‌ను సీఎం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దీనిని గ్రహించి ముందుకు వెళ్తే.. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి దీనిపై వైసీపీ అధినాయకత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!