Thursday, March 28, 2024

2019 ఎన్నికల్లో ఇప్పటం గ్రామంలో జనసేనకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే మైండ బ్లాక్ అవ్వడం ఖాయం

- Advertisement -

2019 ఎన్నికల్లో ఇప్పటం గ్రామంలో జనసేనకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా..?

మంగళగిరి నియోజకవర్గలోని ఇప్పటం గ్రామం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు వేదికగా మారింది. ప్రస్తుత ఏపీ రాజకీయ మొత్తం కూడా ఇప్పటం గ్రామం చూట్టునే తిరుగుతుంది. అధికార , ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఇప్పటం గ్రామంలోనే తిష్ట వేశాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గత మార్చిలో ఇప్పటం గ్రామంలో నిర్వహించడే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆ సమయంలో పవన్ ఇప్పటం గ్రామానికి 50 లక్షలు గ్రామా అభివృద్దికి ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో.. అక్కడ ప్రభుత్వమే అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చూట్టింది. ఈక్రమంలో ప్రభుత్వ స్థలంలో కట్టిన అక్రమ ప్రహారీ గోడలను నోటీసులు ఇచ్చి మరి కూల్చి వేశారు. దీనిపై ఆగ్రహవేశాలతో ఊగిపోయిన ఇప్పటం గ్రామంపై తన సైనికులతో దాడి చేశారు.

కొట్టుకుందాం రండీ… రక్తపాతాలు జరగాల్సిందే.. అన్నింటికి సిద్దంగా ఉండండీ అంటూ తన పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వారో మేమో తెలిపోవాలని శపథాలు కూడా చేశారాయన. 1000 మంది కార్యకర్తలతో ఇప్పటంలో పవన్ హల్ చల్ చేశారు. కావాలనే జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శలు చేశారు. అయితే అక్కడ వాస్తవంగా .. వైసీపీ వారు కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఇప్పటంలో కూల్చిన వారి కట్టడాలు అన్ని కూడా వైసీపీవే కావడం గమనర్హం. అయితే దీనిపై గ్రామస్తులు కూడా బయటకు వచ్చిన నిజాలు వెల్లడించారు. గ్రామంలో ఎవరి ఇళ్లు కూల్చలేదని.. కేవలం ప్రహరీ గోడలను మాత్రమే పడేశారని క్లారిటీ ఇచ్చారు.

గ్రామంలో మూడు కులాలు ఉన్నాయని.. అందరం కూడా అన్నదమ్ములం కలసిమెలిసి ఉన్నాం అని.. ఇప్పుడు జనసేన కార్యకర్తలు బయట నుంచి వచ్చి.. ఇక్కడ మా మధ్య గొడవలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటంలో ఇంత హంగామా చేస్తున్న జనసేన.. గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయని ఆరా తీయగా…ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి కేవలం 14 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. స్వతంత్ర్య అభ్యర్థికి జనసేన అభ్యర్థి కన్నా కూడా ఎక్కువ ఓట్లు అంటే 23 ఓట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటంలో గ్రామంలో పవన్‌కు 53 మంది అభిమానులు ఉండగా.. అందులో కేవలం 14 మంది మాత్రమే.. జనసేనకు ఓట్లు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ మాత్రం దానికే జనసేన ఓ తెగ హంగామా చేస్తున్నారు. మరి ఈ లెక్కలపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!