భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయ్ కన్నుమూశారు. 93 సంవత్సరాల అటల్ బిహార్ వాజ్ పేయ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ లో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటు అటల్‌జీ సాయంత్రం 5:05 గంటలకు తుది శ్వాస విడిచారు.

1924 డిసెంబర్ 25న జన్మించిన అటల్ బిహార్ వాజ్ పేయ్ దేశ ప్రధానిగా 1998 నుంచి 2004 వరకు కొనసాగారు. 1999 లో పార్లమెంట్ లో అవిశ్వాసతీర్మానం సమయంలో అప్పటి వరకు బిజెపి వైపు ఉన్న అన్నా డీఎంకే ప్లేట్ పిరాయించడంతో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. మరలా తరువాత జరిగిన ఎన్నికలలో బిజెపిని విజయం వైపు నడిపించి మరో సారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఐదు సంవత్సరాలు పరిపాలించారు.