కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు ఇది. సుదీర్ఘకాలం పాటు ఏపీ రాజకీయాలలో కొనసాగుతున్నారాయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ఆర్ హయంలో ఆయన లీడర్‌గా ఫోకస్ కూడా అయ్యారనే చెప్పాలి. వైఎస్ఆర్ మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం కూడా కన్నా లక్ష్మీనారాయణకు ఉంది. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ మరణం తరువాత తన ప్రభాల్యాన్ని కొల్పోయారనే చెప్పాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి ఆయన ఓడిపోవడంతో.. కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. వైసీపీ నేతలతో మంతనాలు జరపడంతో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది.
కాని ఆయన అనుహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కూడా ఆయనకు అధ్యక్ష పదవిని అప్పగించింది. కాని పార్టీ అధ్యక్షుడుగా ఆయన పెద్దగా ఏం చేయలేకపోవడంతో.. కన్నా లక్ష్మీనారాయణను తొలగించి… ఆయన స్థానంలో సోము వీర్రాజుకు అధ్యక్ష పదవిని అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆయన బీజేపీకి దూరం కావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. దాదాపు ఆయన బీజేపీని వీడటం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇక్కడ అసలు ప్రశ్నగా మారింది. జనసేన పార్టీలో చేరి తన సీనియారిటీని తగ్గించుకోలేనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలో రాయపాటి సాంబశివరావుకు తనకు మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశాలు కూడా లేవు. దీంతో ఆయన ముందున్న ఆప్షన్.. వైసీపీనే . ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తన సహచరులైన పెద్దిరెడ్డి, బొత్స ఇలాంటి నేతలంతా కూడా వైసీపీలో కీలకంగా మారారు. తాను కూడా వైసీపీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి తోడు తనకు వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండటంతో..ఆయన వైసీపీ పార్టీలో చేరాలని చూస్తున్నారట. మరి కొద్దిరోజుల్లో ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయం అనే సంకేతాలు అందుతున్నాయి. మరి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.