Wednesday, April 17, 2024

ఇలియానా బికినీ ‘బ్రహ్మాస్త్ర’ కంటే బంపర్ హిట్టు!

- Advertisement -

సన్నజాజి నడుముతో గుండెల్లో గుబులు రేపిన ఇలియానా టాలీవుడ్ ని దశాబ్ధం పైగానే ఏలింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలైంది. తిరిగి సౌత్ కి కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. అలాగని హిందీ కెరీర్ ఆశించినంతగా లేదు. అదే క్రమంలో ఇలియానా సోషల్ మీడియాల్లో వరుసగా ఫోటోషూట్లను షేర్ చేస్తూ అభిమానులను యంగేజ్ చేస్తోంది.

తాజాగా ఇలియానా షేర్ చేసిన పసుపు రంగు బికినీ యువతరంలో వైరల్ గా మారింది. గుబులు రేపే అందాలను ఇల్లీ ఎలివేట్ చేసిన తీరుపై యూత్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు. ఇలియానా లెమన్ ఎల్లో బికినీలో ఉన్న రెండు ఫోటోలను పోస్ట్ చేసి.. ”ఫీల్ట్ గుడ్ మే నాట్ డిలీట్” అని రాసింది. మరో ఫోటోకి క్యాప్షన్ ఇస్తూ… అంతకుముందు సైనస్ వల్ల తాను ఈత కొట్టడానికి వీలుపడలేదని తెలిపింది. ఎట్టకేలకు మంచం వదిలి ఈతకు రెడీ అయ్యానని చెబుతూ ఒక బికినీ సెల్ఫీని క్లిక్ చేసింది. దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. ఈ బికినీ ఫోటోలు డిలీట్ చేయవు కదా? అని సందేహం వ్యక్తం చేసాడు. ఇలియానా బికినీ ‘బ్రహ్మాస్త్ర’ కంటే బంపర్ హిట్టు! అంటూ వేరొక అభిమాని వ్యాఖ్యానించాడు.

తెలిసీ తెలియక తప్పు చేసిందా?

గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ డైలమా ఇంకా వీడలేదు. ఈ బ్యూటీ టోన్డ్ ఫిజిక్ ని ప్రదర్శిస్తూ బికినీ బీచ్ విహారాలతో చెలరేగుతున్నా కానీ నటిగా అవకాశమిచ్చేవాళ్లే కరువయ్యారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేసిన ఇల్లీ వరుస ఫ్లాపులతో చతికిలబడింది. దేవుడు చేసిన మనుషులు- అమర్ అక్బర్ ఆంటోని లాంటి డిజాస్టర్ సినిమాల్లో నటించిన ఇలియానాకు మళ్లీ టాలీవుడ్ లో ఆఫర్ లేదు. అటు బాలీవుడ్ లోనూ సన్నివేశం ఏమంత కలిసి రావడం లేదు. ది బిగ్ బుల్ తర్వాతా సరైన ఆఫర్లు లేవు. కెరీర్ పరంగా కంబ్యాక్ అన్నదే లేదు.

నిజానికి 2012 లో బాలీవుడ్ కి జంప్ చేసి ఇలియానా అతి పెద్ద తప్పిదం చేసిందని విమర్శలొచ్చాయి. సౌత్ లోనే ఇంకా తన కెరీర్ బండిని కొనసాగించి ఉంటే అవకాశాలు వచ్చేవి అని కూడా టాక్ వినిపించింది. కానీ ఇటీవల ఇక్కడ కెరీర్ దాదాపుగా ముగిసింది. ఇక్కడ చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్ చిత్రంలో కనిపించింది. అన్ఫెయిర్ & లవ్లీ అనే చిత్రంలోనూ నటిస్తోంది.

కత్రిన సోదరుడితో డేటింగ్ ..

ఇలియానా డి క్రజ్ కొత్త ప్రేమాయణం ఇటీవల హాట్ టాపిక్. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ ను ఇలియానా పెళ్లి చేసుకోబోతోందంటూ ప్రచారం సాగుతోంది.

సెబాస్టియన్ తో ఇలియానా సాన్నిహిత్యం పై బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలొస్తున్నాయి. జూలై 16న జరిగిన కత్రిన పుట్టినరోజు వేడుకలో కత్రినా తన భర్త.. నటుడు విక్కీ కౌశల్.. ఇలియానా బృందం మాల్దీవుల్లో సెబాస్టియన్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో సెబాస్టియన్ తో ఇలియానా సాన్నిహిత్యం చూశాక.. దీనిపై ఆరాలు మొదలయ్యాయి.

బీచ్ సెలబ్రేషన్ వైరల్ గా మారిన వెంటనే ఇలియానాతో కత్రినా అసాధారణ స్నేహం గురించి రకరకాల ఊహాగానాలు కొనసాగాయి. అటుపై కత్రినా సోదరుడు.. మోడల్ సెబాస్టియన్ తో ఇలియానా సన్నిహితంగా మెలుగుతోందని దీనివల్లనే ఇద్దరు నటీమణులు (కత్రిన-ఇలియానా) దగ్గరై అది స్నేహానికి దారితీసిందని ముంబై మీడియా కథనాలు రాసింది. ఇటీవల సెబాస్టియన్ ను ఇలియానా పెళ్లి చేసుకోబోతోందన్న పుకారు నెటిజన్లలో దావానలంలా వ్యాపించింది. తాజా సమాచారం ప్రకారం..తన పెళ్లి కోసం ఇలియానా షాపింగ్ లు చేస్తూ బిజీగా ఉందని కూడా టాక్ వినిపించింది.

మీడియా కథనాల ప్రకారం.. దాదాపు ఆరు నెలలుగా రిలేషన్ షిప్ ని కొనసాగిస్తున్న ఈ జంట మీడియా కంటికి చిక్కకుండా దాక్కుంటోంది. ఇలియానా- సెబాస్టియన్ కత్రినా బాంద్రా ఇంట్లో (పాత ఇల్లు) లేదా ఇలియానా నివాసంలో ఒకరితో ఒకరు తమ విలువైన సమయాన్ని గడుపుతున్నారని కూడా కథనాలొచ్చాయి. ముంబై మీడియా కథనాలు నిజమే అయితే.. ఈ జంట త్వరలో ఓ ఇంటివాళ్లయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ లో కరణ్ జోహార్ ఇలియానా డేటింగ్ వ్యవహారాన్ని కన్ఫామ్ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!