తిరుపతిలో పంక్చర్ లు వేసుకుంటూ కాలం వెళ్లదీసే ఒక వ్యక్తి పంక్చర్ షాప్ మీద 100 కోట్ల రూపాయలు సంపాదించాడా అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ వ్యక్తి పైకి పంక్చర్ షాప్ మీద అని చెబుతున్నా ముఖ్యంగా ఆ వ్యక్తి ఆదాయ వనరు వడ్డీ వ్యాపారమని తెలుస్తుంది. తిరుపతికి చెందిన కందిశెట్టి రమేష్ 20 సంవత్సరాల క్రితం పంక్చర్ షాప్ నెలకొల్పి రోజుకి 50 రూపాయల ఆదాయంతో మొదలైన తన జీవితం కొన్ని రోజుల తరువాత వడ్డీ వ్యాపారంలోకి అడుగుపెట్టి, తనదైన రీతిలో వడ్డీలు ఇస్తూ ప్రజలను ఆకర్శించాడు. ప్రజలకు ఇచ్చిన వడ్డీలు తిరిగి రాబట్టడంలో కూడా ఆ వ్యక్తి అందె వేసిన చెయ్యని, అవసరమైతే భౌతిక దాడులు కూడా చేస్తాడని చెవుతున్నారు. ఒక వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు ఐటి అధికారులు దాడులు చేయగా అతని ఆదాయం 100 కోట్ల పైమాటే అని తేలింది. పంక్చర్ వేసుకునే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ అంత డబ్బు సంపాదించవచ్చా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Tags : Tirupathi, Puncture Repair Shop, Income Tax Raids, Andhrapradesh, Telugu News