Saturday, April 20, 2024

రామ్మోహన్ నాయుడుపై ట్రబుల్ షూటర్‌ను రంగంలోకి దించుతున్న జగన్

- Advertisement -

టీడీపీ యువ కీలక నాయకులలో రామ్మోహన్ నాయుడు కూడా ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అటు సమయస్పూర్తి,ఇటు రాజకీయ వ్యూహాం రెండు కూడా పుష్కలంగా ఉన్న నేత. పైగా మైకు తీసుకుంటే చాలు ప్రత్యర్థుల మీద అనర్గళంగా విమర్శలు చేయగల నాయకుడు. మరి అలాంటి నాయకుడు ఓడించాలంటే ప్రత్యర్థి పార్టీలు ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఇదే పనిలో నిమగ్నమైయ్యారు వైసీపీ అధినేత జగన్. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓటమికి పక్కా స్కెచ్ వేస్తున్నారాయన. 2014,2019 వరుసగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జగన్ సునామిని తట్టుకుని మరి విజయం సాధించారాయన.

రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రామ్మోహన్ నాయుడును ఓడించాలని వ్యూహాలు పన్నుతున్నారు వైసీపీ నాయకులు. ఆయన మీద పోటీ చేయడానికి బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే పలువురు పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామ్మోహన్ నాయుడు మీద 2024 ఎన్నికల్లో కిల్లి కృపారాణి బరిలోకి దిగబోతున్నారట. 2009 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడును ఓడించిన చరిత్ర ఆమెకు ఉంది. అందుకే ఆమెనే బరిలోకి దింపాలని చూస్తుందట వైసీపీ అధిష్టానం.

శ్రీకాకుళంలో కిల్లి కృపారాణికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆమెకు కాళింగ సామాజికవర్గం మద్దతు ఎటూ ఉంది. పైగా గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం ఇవ్వన్ని కలిసి ఆమెను పోటీలో నిలిపేలా చేస్తాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారామె. ఆమెకు జగన్ శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు. అయితే ఆమె రాజ్యసభ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఇవ్వలేదు. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. ఒక దశలో పార్టీని వీడిపోవాలన్న ఆలోచన కూడా చేశారన్న ప్రచారం సాగింది. కాని వచ్చే ఎన్నికల్లో సీటు హామీ ఇవ్వడంతో ఆమె వైసీపీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు మీద కిల్లి కృపారాణి పోటీ చేయడం ఖాయం అని అంటున్నారు. మరి రామ్మోహన్ నాయుడు వరుస విజయాలకు కిల్లి కృపారాణి ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!