Friday, March 29, 2024

రఘురామ నియోజకవర్గంలో తొలిసారి జగన్ పర్యటన..ఫైనల్ బ్యాటింగ్ షూరు..?

- Advertisement -

సజావుగా సాగుతున్న జగన్ పాలనలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలకలం సృష్టించారనే చెప్పాలి. నరసాపురం ఎంపీగా గెలిచిన తరువాత ఆయనలో చాలానే మార్పులు కనిపించాయి. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత ఆయన ప్రసంగాల్లో జగన్ గురించి మాట్లాడిన మాటలు బాగానే ఉన్నాయి. నేనే కాదు గత ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరు కూడా జగన్ ఇమేజ్ వల్లే గెలిచారని రఘురామ కృష్ణంరాజు పలు మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పుకొచ్చారు. జగన్ గారి పాదయాత్ర వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు. అయితే తరువాత కొన్నాళ్లుకు రఘురామ కృష్ణంరాజు స్వరం మార్చారు. రెండు నెలలు క్రితం జరిగిన మీటింగ్‌లో కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్థిలాలి అంటూ నినదాలు చేశారు.

అప్పుడే రఘురామ కృష్ణంరాజు అసలు రంగు బయటపడింది. కార్యకర్తలు నినదాలు చేస్తుంటే ఎవరి నాయకత్వం ఎవరికి కావాలి అంటూ అక్కడ ఉన్న కార్యకర్తలపై మండిపడ్డారు రఘురామ కృష్ణంరాజు. ఆ తరువాత నుంచి నిదానంగా ఎంపీ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తునే ఉన్నాయి. పార్టీపై ధిక్కార స్వరం పెంచుతూ వచ్చారు. తాను నా సొంత ఇమేజ్‌తోనే గెలిచానని, జగన్ ఇమేజ్ కన్నా నా ఇమేజ్ ఎక్కువ అని చెప్పుకొచ్చారు. నేనే జగన్‌కు బలం అయినే తప్ప నాకు జగన్ ఏ విధాంగా బలం కాలేదని సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలను విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీ కలకలం రేగింది. దీంతో వైసీపీ కార్యకర్తలు , పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ముక్కుమ్మడిగా రఘురామ కృష్ణం రాజుపై మాటల యుద్దం మొదలు పెట్టారు. 151 ఎమ్మెల్యేలతో పాటు, 23 ఎంపీలు మొత్తం కూడా జగన్ బొమ్మతోనే గెలిచారని , ఎవరు కూడా సొంత బొమ్మతో గెలవలేదని మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు.

ఇటువంటి సమయంలోనే ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. షోకాజ్ నోటీసులు రాగానే రఘురామ కృష్ణంరాజు మాటాల్లో చాలా తేడా కనిపించింది. తాను ఎప్పుడు కూడా జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బయట జరుగుతున్న విషయాలను జగన్‌కు చెప్పాలనే అలా మాట్లాడాను కాని పార్టీకి కాని , జగన్‌కు కాని చేడు చేయలని తాను భావించలేదని చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణంరాజు. దీంతో ఆయన కాస్తా మెత్తపడినట్లుగానే అనిపించింది. అయితే తనకు నోటీసులు ఇవ్వడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. పార్టీ పేరును కూడా ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయన పార్టీ వీడటానికే రంగం సిద్దం చేసుకున్నారని తెలిసిపోయింది. తనకు రక్షణ లేదని పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులపై రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ఢిల్లీ వెళ్లి మరి బీజేపీ నాయకులను కలిసి వచ్చారు.

ఈ ఘటనతో ఆయనలో బీజేపీలో చేరుతున్నారని, అందకే ఇలా వైసీపీపై విమర్శలు చేస్తున్నారని తెలిసింది. 104,108 అంబులెన్స్‌ల కార్యక్రమంతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తున్న సమయంలో కూడా రఘురామ కృష్ణంరాజు మాత్రం ప్రధాని మోదీ భజన చేశారు. అయితే ఢిల్లీ వెళ్లిన రఘురామ కృష్ణంరాజుకు అక్కడ పెద్దగా ఒరిగింది ఏం లేదనుకోండి. ఎందుకంటే ఢిల్లీలో కూడా జగన్ కోటరి చాల బలంగా ఉంది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి నిరాశతో వెనుతిరిగారు. రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ వెళ్లీ వచ్చిన తరువాత రాజకీయ పరిణమాలు చాలా వేగంగా మారాయి. వైసీపీ ఎంపీలు పనిలో పనిగా స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.

రఘురామ కృష్ణంరాజు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు పేపర్ కటింగ్‌లను కూడా స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. రఘురామ కృష్ణంరాజు ఎంపీగా అనర్హుడని, ఆయన్ను వెంటనే డిస్మిస్ చేయలని స్పీకర్ కు విన్నవించారు వైసీపీ ఎంపీలు. ఈ మధ్య టీడీపీ అనుకుల మీడియా కూడా రఘురామ కృష్ణంరాజును లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారి అనుకుల మీడియాలో ఎక్కడ కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా నరసాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన ఖారారైంది. ఈనెల 28వ తేదీన నరసపురం నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటిస్తారు. ఆ రోజున సీఎం జగన్ నర్సాపురంలో అనేక ప్రాజెక్టులకు శంకుసస్థాపన చేయనున్నారు. ఆక్వా వర్సిటీకి శంకుస్థాపన చేయటానికి షెడ్యూల్ ఖరారైంది. దీంతో..అక్కడే సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్ధి ఎవరనేది సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రఘురామ అంశం పైన సీఎం జగన్ ఎక్కడా ఓపెన్ గా స్పందించలేదు. మరి నరసాపురం నియోజకవర్గంలో జరిగే సమావేశంలో తొలిసారి ఆయన గురించి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి దీనిపై వివాస్పద ఎంపీ రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!