వచ్చే ఎన్నికల్లో గెలుపు జగన్‌దే అని ప్రజలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా అభిప్రాపడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎలాంటి ఘన విజయం జగన్ సాధించారో.. తిరిగి అంతే ఘన విజయాన్ని సొంతం చేసుకుంటారని అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఏ విపక్షానికి చెందిన నేత వచ్చే ఎన్నికల్లో తిరిగి జగన్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పడం .. ఇప్పుడు ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ జగన్ విజయం సాధిస్తారని చెప్పిన నేత ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఏపీలో అప్పుడే ఎన్నికల వాతవరణం కనిపిస్తుంది. అధికార , ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు .. ఒకరుపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు అప్పుడు ప్రజల్లో తిరుగుతూ.. భారీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు జరిపిన కందుకురు సభలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే.దీనిపై చంద్రబాబుపై చాలానే విమర్శలు మూటగట్టుకున్నారాయన. ఇదిలా ఉంటే ఎవరెన్ని అనుకున్న వచ్చే ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని సీపీఐ నాయకుడు రామకృష్ణ చెప్పడం …ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కలిసి చేసి చంద్రబాబును సీఎం చేయడంలో దోహదపడ్డారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి కూడా కనిపించడం లేదు.గతంలో కంటే జగన్ చాలా బలంగా కనిపిస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యనించారు.
అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే.. జగన్ గెలుపు అవకాశాల మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉందని సీపీఐ నాయకుడు రామకృష్ణ చెప్పుకొచ్చారు. ఒకవేళ టీడీపీ, జనసేన విడి విడిగా పోటీ చేస్తే.. ఖచ్చితంగా జగనే విజయం సాధిస్తారని.. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని రామకృష్ణ వెల్లడించారు. అప్పుడు వైసీపీ నాయకులు గెలుపు గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవశరం లేదని సీపీఐ రామకృష్ణ చెప్పుకొచ్చారు. సీపీఐ నేత రామకృష్ణ చెప్పిన మాటలపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే కష్టం అవుతుంది కాని.. గెలుపు మాత్రం ఆయనదే అని.. ఒకవేళ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే..ఖచ్చితంగా జగనే విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణమాలను చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.