Friday, March 29, 2024

జగన్ సంచలన నిర్ణయం .. తొలిసారి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి

- Advertisement -

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఈ పోస్ట్ జాతీయ స్థాయి పార్టీలలో ఎక్కువుగా కనిపించేది. తరువాత దీనిని టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం మొదలుపెట్టింది. చంద్రబాబు అనుచరుడు అయిన రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్నాళ్లకే రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. తరువాత రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కూడా అయ్యారనుకోండి అది వేరే విషయం. తాజాగా ఈ పోస్ట్ వైసీపీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అవును మీరు వింటుంది నిజమే వైసీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు జగన్. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే… వైసీపీలో A TO Z మొత్తం కూడా జగనే. పైకి పార్టీకి , ప్రభుత్వనికి చాలామంది సలహాదారులు ఉంటారు కాని.. అన్ని విషయాలను జగనే దగ్గరుండి కులంకుషంగా చెక్ చేసుకుంటారు.

అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు పార్టీలో విజయమ్మ, షర్మిల లేకపోవడంతో పలు బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే పార్టీ స్థాపించిన తరువాత తొలిసారి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేశారు. పైగా ఆ పదవి బాధ్యతలను మహిళ నేతకు ఇచ్చి మరింత షాక్‌కు గురి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే, పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు సీఎం జగన్. ఇందులో భాగంగానే, వైసీపీ పార్టీలో కొంత మందికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు జగన్.ఇక తాజాగా వైసీపీలో మొదట సారి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్‌ చేశారు. అంతేకాదు, వైసీపీ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని నియామకం చేశారు.

ఈ మేరకు ప్రకటించింది పార్టీ కేంద్ర కార్యాలయం. అటు వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం ప్రెసిడెంట్ గా ధనుంజయ్ రెడ్డి, బసిరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రకటించింది పార్టీ కేంద్ర కార్యాలయం. వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రచారం మొత్తం కూడా వీరే దగ్గరుండి చూసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎప్పుడు లేనది కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మరి కొత్తగా వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పార్టీలో ఎలాంటి ఫలితాలను తీసుకువస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!