Wednesday, October 16, 2024

సోయి తప్పిన జన సైనికులు .. స్థాయి మరిచి ప్రేలాపనలు

- Advertisement -

మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఉస్కో అందట .. జనసైనికులు అలా తయారయ్యారు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదేనేమో! .. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే తాడూ బొంగరం లేదు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి అడ్రస్ చెబితే తప్ప తనకు సినిమాల్లోకి ఎంట్రీ లేదు. అయన నీడన. అయన తోడున అలా మెల్లగా ఎదిగారు.. ఇప్పుడు అయన అభిమానులు ఏకంగా చిరంజీవినే ప్రశ్నించే స్థాయికి చేరారు.

పవన్ కళ్యాణ్ నిలకడలేనితనానికి, స్థిరం తక్కువ మాటలు.. ప్రకటనలు.. ఊగిపోతూ చేసే ప్రసంగాలు.. మొన్నటి మాటకు… ఈరోజు మాటకు పొంతనలేకపోవడాన్ని సమాజం గమనిస్తూ వస్తోంది. దీంతో అయన ఎన్నిరోజులు ప్రజల్లో ఉన్నా ఆయన్ను సినిమా హీరోగా తప్ప నాయకుడిగా చూడలేని పరిస్థితి. అందుకే రెండుచోట్లా ఓడిపోయిన రికార్డ్ మిగిలిపోయింది. ఇదే విషయం ఆయన పలుమార్లు మీటింగుల్లో అనేశారు. తనను చూడ్డానికి జనాలు వస్తున్నారు తప్ప ఓట్లు వేయడం లేదని నిష్టూరమాడారు. అయితే ఓట్లు వేయడానికి.. నాయకుడిగా గుర్తించడానికి ప్రజలు కొన్ని అర్హతలు నిర్ణయిస్తారు. అవేమి పవన్ కళ్యాణ్‌లో లేకపోవడంతో ఆయన్ను తిరస్కరించారు. దీన్ని జీర్ణించుకోలేని . అంగీకరించలేని పవన్ అభిమానులు, ఇప్పుడు ఏకంగా చిరంజీవిని నిందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను అసలు సీరియస్ నాయకుడిగా చూడకపోవడానికి ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణం అని సోషల్ మీడియాలో మొదటి నుంచీ యాక్టివ్ గా ఉండే రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్‌ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనము చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెర లేపాయి.

అసలు చిరంజీవి ప్రోత్సాహం లేకుంటే పవన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడన్న విషయాన్ని మరిచిన జనసైనికులు ఇప్పుడు పెట్టిన చేతిని కరుస్తున్న కుక్కల మాదిరి తయారయ్యారు. దీనికి చిరు అభిమానులు సైతం రిప్లై ఇస్తున్నారు . మా అన్నయ్యకు విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు .. మీకు అదీ దిక్కులేదు నోర్మూసుకోండి అని ఒకరు అంటే, మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యను అంటారా అంటూ చిరు అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు ..

ఫ్లోలో వచ్చేసింది ఊరుకోండి : నాగబాబు

ఇదిలా ఉండగా ఈ తగాదా ముదిరి ఇద్దరి ఫ్యాన్స్ ఇలా మాటలు విసురుకోవడంతో నాగబాబు లైన్లోకి వచ్చి.. లీవిట్.. వదిలేయండమ్మా… ఆమె తెలిసీ తెలీకుండా ఫ్లో‌లో అలా అనేసింది… మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళా.. పట్టించుకోకండి అని శాంతపర్చారు. తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేస్తే చేసారు కానీ.. పవన్ అసమర్థతకు … చంద్రబాబు దగ్గర సరెండర్ అయి ఉండడానికి చిరంజీవికి ఎం సంబంధం? అని చిరు అభిమానులు గుర్రుమంటున్నారు.. మొత్తానికి చిరంజీవి నీడన ఎదిగిన పవన్, ఆ విషయాన్నీ గుర్తించని జనసైనికులు పెద్ద అజ్ఞానులు అని చిరు ఫాన్స్ అంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!