యూట్యూబ్ వీడియోలతో లక్షల లక్షలు ఆర్జించేవారిని చూసాం కానీ, ఈ యూట్యూబ్ వీడియోలతో నష్టం ఏమిటా అనుకుంటున్నారా? అవును యూట్యూబ్ వీడియోలతో మాకు 500 కోట్లు నష్టం వచ్చిందని ప్రముఖ జ్యూవెలరీ సంస్థ కళ్యాణి జువెలరీస్ కేరళ హైకోర్టు ను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో తమ బ్రాండ్ గురించి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కోరింది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

కళ్యాణి జువెలర్స్ కు సంబంధించి కువైట్ బ్రాంచ్ లో సాధారణ తనికీలు జరిగాయని, ఆ వీడియోలు ఎడిట్ చేసి కళ్యాణి జువెలర్స్ ను సీజ్ చేసారని యూట్యూబ్ లో వార్తలు పుంఖాను పుంఖాలుగా పుట్టిస్తున్నారని, అవి సాధారణ తనిఖీలని, తమ ప్రత్యర్థి కంపెనీలు వీటిని సాకుగా చూపి అవినీతి నిరోధక శాఖతో ముడి పెట్టి తన కళ్యాణి జువెలర్స్ ను బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు అదుపు చేయాలని హైకోర్ ను కోరింది. కళ్యాణి జువెలర్స్ పిటిషన్ స్వీకరించిన కోర్ట్ సోషల్ మీడియాలో నకిలీ వార్తలు అదుపు చేసందుకు క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Tags : Youtube, Kalyani Jewelers, Kuwait Branch, Social Media, High Court