నందమూరి హరికృష్ణ రెండు రోజుల క్రితం నార్కెట్ పల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మృత్యు వాత పడ్డాడు. హరికృష్ణను వెంటనే దగ్గరలోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ లో జాయిన్ అయిన కొద్ది సేపటికి హరికృష్ణ మృతి చెందాడు. ఇక హరికృష్ణ మృతి చెందిన తరువాత కామినేని హాస్పిటల్ సిబ్బంది తీరిగ్గా హరికృష్ణతో సెల్ఫీలు దిగారు. సెల్ఫీ దిగిన హాస్పిటల్ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

దీనిపై ఇప్పుడు నెటిజన్లు వారిపై విమర్శలకు దిగుతున్నారు. ఒకవైపున హరికృష్ణ మృత్యువుతో పోరాడి చనిపోతే సెల్ఫీల పిచ్చితో హరికృష్ణతో సెల్ఫీ దిగటం చాల దారుణం. సెల్ఫీల పిచ్చి చనిపోయిన మనుషులతో కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టి లైకులు కోసం ఆరాటపడడం దారుణమైన విషయం. దేనిపై కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.