Wednesday, October 16, 2024

జగన్‌పై మంచు విష్ణు సంచలన కామెంట్స్

- Advertisement -

మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ గురించి మాట్లాడి ఆయన సంచలనంగా సృష్టించారు. ఆయన తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జగన్‌తో తనకున్న బంధాన్ని గురించి వివరించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..వైఎస్ ఫ్యామిలీతో మంచు ఫ్యామిలీకి రిలేషన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వైఎస్ఆర్ ఫ్యామిలీ అమ్మాయినే మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యన్ని సాహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు మంచు మోహన్ బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే.

జగన్ సీఎం అయిన తరువాత… మెగాస్టార్ చిరంజీవితో జగన్ స్నేహంగా మెలగడంతో..మోహన్ బాబు జగన్‌కు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య మోహన్ బాబు ప్రధాని మోదీకి మద్దతుగా మాట్లాడటంతో ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై మాత్రం మంచు ఫ్యామిలీ స్పందించింది లేదు. అయితే తాజాగా మంచు విష్ణు ..వివిధ పార్టీల్లో ఉన్న కమ్మ నేతలతో వరుసగా భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు, దేవినేని అవినాష్, టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ వంటి నేతలతో మంచు విష్ణు వరుసగా సమావేశం అయ్యారు దీంతో వైసీపీలోని కమ్మ నేతలను మంచు విష్ణు టీడీపీలోకి తీసుకువెళ్తున్నారని ప్రచారం జరిగింది.

తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో దీనిపై ఆయన స్పష్టత ఇచ్చారు. లావు కృష్ణదేవరాయులు, దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్ అందరు కూడా నా వెల్ విషర్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. జగనన్నతో తనకు దూరం అనే మాట లేదని.. అమ్మ, నాన్న తరువాతే జగనన్ననే నాకు అన్ని అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. తాను మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించినప్పుడు కూడా జగనన్న ప్రత్యేకంగా ఫోన్ చేసి తనని అభినందించారని.. భారతమ్మ కూడా తనకు అభినందనలు తెలిపారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. వైఎస్ ఫ్యామిలీతో తనకు వీడదీయలేని బంధం ఉందని.. కొన్ని మీడియా ఛానెల్స్ కావాలనే మా కుటుంబం మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మంచు విష్ణు వ్యాఖ్యనించారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!