గతంలో సంచలనం సృష్టించిన మార్గదర్శి కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కు చెందిన మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్స్ సేకరిస్తున్నట్లు గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు స్పందించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీచేసింది. అయితే రామోజీరావు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి కేసు స్టే మీద ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ముఖ్యమైన కేసులు ఆరు నెలలకు మించి స్టే ఉండకూడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మరోసారి మార్గదర్శి వ్యవహారం చర్చకు వచ్చింది. మరోసారి స్టే పొడిగించాలన్న రామోజీరావు అభ్యర్ధనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. స్టే నిరాకరించడంతో మార్గదర్శికి చుక్కెదురైంది. ఈ మార్గదర్శి వ్యవహారంపై స్పందన తెలియచేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.